హైదరాబాద్: నాంపల్లి రెడ్ హిల్స్‌లోని ఒక భవనం మూడో అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా ఎగసిపడుతున్న మంటలు, దట్టమైన పొగతో ఆ ప్రాంతం నిండిపోవడంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ప్రమాద సమయంలో భవనంలో 23 మంది నివాసితులు ఉన్నప్పటికీ, సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది మంటలు ఇతర అంతస్తులకు వ్యాపించకుండా అదుపులోకి తెచ్చారు. భవనంలో చిక్కుకున్న 23 మందిని సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు.