హైదరాబాద్‌లోని హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఒకరి మృతి
Major fire at Hotel Sohail in Malakpet. హైదరాబాద్‌లోని హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఒకరి మృతి
By అంజి Published on 6 Jan 2023 9:15 PM ISTహైదరాబాద్: మలక్‌పేట్‌లోని సోహైల్ హోటల్‌లో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది, మలక్‌పేట, గౌలిగూడ అగ్నిమాపక కేంద్రాల నుండి రెండు అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. గ్యాస్ లీక్ కారణంగా భారీగా మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదం వల్ల ఒకరు మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తి హోటల్‌పని చేసే కార్మికుడు షాబుద్దీన్ (34)గా పోలీసులు గుర్తించారు. మలక్‌పేట-నల్గొండ ఎక్స్‌రోడ్డు ప్రధాన రహదారి పక్కనే రెస్టారెంట్ ఉండడంతో కొన్ని గంటలపాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ట్రాఫిక్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో హోటల్‌లోని వినియోగదారులు భయాందోళనకు గురై హడావుడిగా బయటకు పరుగులు తీశారు. మామిడిపూడి నాగార్జున ఏరియా ఆస్పత్రి మలక్‌పేట/పోలీస్ ఆస్పత్రికి ఆనుకుని ఉన్న రెస్టారెంట్‌లో మంటలు చెలరేగడంతో రోగుల్లో భయాందోళన నెలకొంది. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ప్రాణనష్టం జరగకుండా ఆస్పత్రిలో ఉన్న రోగులను సురక్షితంగా ఆస్పత్రి నుంచి బయటకు తీసుకొచ్చారు.
అగ్నిమాపక శాఖ అధికారులతో పాటు చాదర్‌ఘాట్ పోలీసుల బృందం సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని, తదుపరి విచారణ కొనసాగుతుందన్నారు. ప్రమాదం జరిగిన హోటల్‌ను స్థానిక ఎమ్మెల్యే అహ్మద్ బలాలా పరిశీలించారు.
Fire breaks out at Hotel Sohail Malakpet @shochaderghat and @TelanganaFire we're rushed to the spot pic.twitter.com/d4ElimBHjo
— S.M. Bilal (@Bilaljourno) January 6, 2023
Fire breaks out at Hotel Sohail Malakpet pic.twitter.com/8LrdzHzQTD
— The Siasat Daily (@TheSiasatDaily) January 6, 2023