Hyd: కేపీహెచ్‌బీ ఫేజ్-6లో భారీ అగ్నిప్రమాదం..దగ్ధమైన దుకాణాలు (video)

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి కెపిహెచ్‌బి (KPHB) ఫేజ్ 6లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

By -  Knakam Karthik
Published on : 8 March 2026 3:21 PM IST

Hyderabad Fire, Kukatpally, KPHB, Fire Accident

Hyd: కేపీహెచ్‌బీ ఫేజ్-6లో భారీ అగ్నిప్రమాదం..దగ్ధమైన దుకాణాలు (video)

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి కెపిహెచ్‌బి (KPHB) ఫేజ్ 6లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక ఖాళీ ప్లాట్‌లోని చెత్తలో మొదలైన మంటలు శరవేగంగా పక్కనే ఉన్న స్క్రాప్ షాపు మరియు టీ స్టాల్‌కు వ్యాపించడంతో ఆ రెండు దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Next Story