హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం..ఫర్నిచర్ గిడ్డంగిలో చెలరేగిన మంటలు (video)

హైదరాబాద్‌లోని చందానగర్‌లో గల అను ఫర్నిచర్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది

By -  Knakam Karthik
Published on : 13 March 2026 8:03 AM IST

Hyderabad News, Chandanagar, Major Fire Accident, Anu Furniture

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం..ఫర్నిచర్ గోడౌన్‌లో చెలరేగిన మంటలు (video)

హైదరాబాద్‌లోని చందానగర్‌లో గల అను ఫర్నిచర్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గిడ్డంగిలో పెద్ద ఎత్తున ఫర్నిచర్ మరియు కలప నిల్వలు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. అధికారులు సమయస్ఫూర్తితో వ్యవహరించి మంటలు పక్కనే ఉన్న భవనాలకు వ్యాపించకుండా అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రస్తుతం అగ్నిప్రమాదానికి గల కారణాలు మరియు ఆస్తి నష్టం వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.

Next Story