హైదరాబాద్‌లో ఈ-రేసింగ్‌.. మహేష్‌ బాబు, అడివి శేష్‌ ఏమన్నారంటే?

Mahesh Babu and Adivi Sesh about Formula E Racing in Hyderabad. భారత్‌లో ఫస్ట్‌టైమ్‌ ఫార్ములా ఈ - రేసింగ్‌ జరగబోతోంది. ఫిబ్రవరి 11న హైదరాబాద్‌ వేదికగా

By అంజి  Published on  25 Jan 2023 12:49 PM IST
హైదరాబాద్‌లో ఈ-రేసింగ్‌.. మహేష్‌ బాబు, అడివి శేష్‌ ఏమన్నారంటే?

భారత్‌లో ఫస్ట్‌టైమ్‌ ఫార్ములా ఈ - రేసింగ్‌ జరగబోతోంది. ఫిబ్రవరి 11న హైదరాబాద్‌ వేదికగా ఫార్ములా ఈ-రేసింగ్‌ జరగనుంది. ఈ రేసింగ్‌పై టాలీవుడ్‌ సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. తాజాగా సూపర్ట్‌ స్టార్‌ మహేష్‌ బాబు, హీరో అడివి శేష్‌.. ఈ రేస్‌పై స్పందించారు. హైదరాబాద్‌ ఈ-రేసింగ్‌కి వేదిక కావడం చాలా గొప్ప విషయమని అన్నారు. ఈ-రేసింగ్‌ను చూడటానికి ఎంతో ఉత్సుకతో ఉన్నట్లు చెబుతూ సోషల్ మీడియాలో ఈ ఇద్దరు హీరోలు వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్‌గా మారాయి.

వీడియోలో మహేష్‌ బాబు మాట్లాడుతూ.. '' భారత్‌లో మొదటి సారిగా జరుగుతున్న ఫార్మూలా ఈ రేసింగ్‌‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం గొప్ప విషయం. సరికొత్త హిస్టరీని క్రియేట్ చేసిన మంత్రి కేటీఆర్‌కు, అనిల్ చలమలశెట్టికి శుభాకాంక్షలు. ఫిబ్రవరి 11న జరుగునున్న ఈ రేసు పోటీలను చూడటానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను'' అని అన్నారు.

ఫార్ములా ఈ-రేస్‌పై హీరో అడివి శేష్ కూడా స్పందించారు. ''ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఫార్ములా ఈ-రేస్‌కు హైదరాబాద్ వేదిక కావడం చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్‌కు ఈ ఘనత తీసుకొస్తున్న మంత్రి కేటీఆర్, గ్రీన్ కో అనిల్ చలమలశెట్టి, తెలంగాణ ప్రభుత్వానికి శేష్ కృతజ్ఞతలు. ఫిబ్రవరి 11న జరగనున్న ఈ ఈవెంట్‌లో నును తప్పక పాల్గొంటాను'' అని చెబుతూ ఓ వీడియోను అడవి శేష్‌ నెట్టింట షేర్ చేశారు.

భారత్‌లోనే తొలిసారిగా హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ- రేసింగ్ ఈవెంట్​ జరగనుంది. హుసేన్‌సాగర్‌ వేదికగా ఫిబ్రవరి 11న జరుగనున్న ఈ అంతర్జాతీయ ఈవెంట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. హుస్సేన్ సాగర్ చుట్టూ 2.37 కిలోమీటర్ల మేర ట్రాక్​పై ఈ ఈవెంట్ జరగనుంది. ఎలక్ట్రిక్ రవాణాను ప్రోత్సాహించే ఉద్దేశంతో ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు. హైదరాబాద్‌ సర్క్యూట్‌లోఅడుగడుగునా భద్రతా పరంగా ప్రత్యేకంగా భారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. పోటీలను వీక్షించేందుకు వచ్చే ప్రేక్షకుల కోసం గ్యాలరీలను నిర్మిస్తున్నారు. ఫార్ములా-ఈ కార్‌ రేసింగ్‌ ట్రాక్‌ చుట్టూ మొత్తం 10 చోట్ల సుమారు 25 వేల మంది కూర్చునేలా వేదికలను నిర్మించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈవెంట్‌ కోసం రెండు కమిటీలను ఏర్పాటు చేసింది.

Next Story