హైద‌రాబాద్ వాసుల‌కు అల‌ర్ట్‌.. నేటి రాత్రి 10 త‌రువాత ఫ్లై ఓవర్లు మూసివేత

Maha Shivaratri & Shab-e-Meraj: All Hyderabad flyovers to be closed down on 18–19 Feb.మహా శివరాత్రి మరియు షబ్-ఎ-మెరాజ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Feb 2023 8:40 AM IST
హైద‌రాబాద్ వాసుల‌కు అల‌ర్ట్‌.. నేటి రాత్రి 10 త‌రువాత ఫ్లై ఓవర్లు మూసివేత

హైదరాబాద్: మహా శివరాత్రి మరియు షబ్-ఎ-మెరాజ్ (జగ్నే కే రాత్) దృష్ట్యా నేడు(ఫిబ్రవరి 18 శ‌నివారం) రాత్రి 10 గంట‌ల నుంచి ఆదివారం ఉద‌యం(ఫిబ్రవరి 19) వరకు నెక్లెస్ రోడ్ ఫ్లైఓవర్‌తో సహా నగరంలోని అన్ని ఫ్లైఓవర్‌లను మూసివేయనున్నారు.

గ్రీన్‌ల్యాండ్స్‌ ఫ్లైఓవర్‌, పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వే, లంగర్‌ హౌజ్‌ ఫ్లైఓవర్‌ మినహా మిగిలిన అన్ని ఫ్లై ఓవ‌ర్లు మూసివేయ‌నున్న‌ట్లు నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ సుధీర్‌బాబు తెలిపారు. వాహ‌న‌దారులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి ప్ర‌త్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల‌ని సూచించారు.

ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో, పౌరులు ప్రయాణ సహాయం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ హెల్ప్‌లైన్ - 9010203626ను సంప్రదించవచ్చు.

Next Story