కేపీహెచ్‌బీలోని పబ్‌లో అశ్లీల నృత్యాలు.. పోలీసుల అదుపులో 9 మంది యువతులు
Madhapur SOT Police Raids KPHB club Masti pub.హైదరాబాద్ నగరంలో పబ్ కల్చర్ పెరిగిపోతుంది. పబ్ నిర్వాహకులు
By తోట వంశీ కుమార్ Published on
4 Jun 2022 5:53 AM GMT

హైదరాబాద్ నగరంలో పబ్ కల్చర్ పెరిగిపోతుంది. పబ్ నిర్వాహకులు ఇష్టారీతిన నిబంధనలను ఉల్లంగిస్తున్నారు. ఇక నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న పబ్‌లపై పోలీసులు కొరఢా ఝుళిపిస్తున్నారు. ఈ క్రమంలో కేపీహెచ్‌బీలోని మంజీరా మెజిస్టిక్‌లో ఉన్న క్లబ్ మస్తీ రెస్ట్రో బార్ అండ్ పబ్‌పై మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు అకస్మిక దాడులు చేశారు.
పబ్ లోపలికి వెళ్లిన పోలీసులు అక్కడ కనిపిస్తున్నది చూసి షాకయ్యారు. యువతులతో అర్థనగ్నంగా నృత్యాలు చేయిస్తూ కస్టమర్లను ఆకట్టుకునే విధంగా పబ్‌లో ఏర్పాటు చేశారు నిర్వాహకులు. పరిమితికి మించి డిజె సౌండ్ తో పబ్ నడుపుతున్నట్లు గుర్తించారు. దీంతో తొమ్మిది మంది యువతులు, మేనేజర్ ప్రదీప్, డీజే ఆపరేటర్ ధనరాజ్, మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పబ్ యజమాని శివప్రసాద్, మేనేజర్లు కృష్ణ, విష్ణు పరారీలో ఉన్నారు. ఇక, డీజే మిక్సర్, హుక్కా ప్లేయర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను కేపీహెచ్‌బీ పోలీసులకు అప్పగించారు.
Next Story