క‌రోనా లాక్‌డౌన్ కాలంలో మందుబాబులు మ‌ద్యం దొర‌క‌క అల్లాడిపోయాడు. స‌డ‌లింపుల అనంత‌రం మ‌ద్యం విక్ర‌య కేంద్రాల వ‌ద్ద మందుబాబులు చేసిన విన్యాసాలు అన్ని ఇన్నీ కావు. అయితే.. మందుబాబుల‌కు హైద‌రాబాద్ పోలీసులు షాకిచ్చారు. హోలీ వేడుక‌ల నేప‌థ్యంలో హైద‌రాబాద్‌, సికింద్రాబాద్ జంట‌న‌గ‌రాల్లో వైన్ షాపులు, బార్లు, క‌ల్లు దుకాణాలు బంద్ పాటించాల్సిందిగా తెలుపుతూ హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ అంజ‌నీ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. మార్చి 28వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి మార్చి 30వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయన్నారు.

హోలీ రోజున ఇతరులకు అసౌకర్యం కలిగించడం.. రోడ్డుపై రంగులు చల్లడం, గుంపులుగా వాహనాలపై తిరగడం వంటి తదితర చర్యలు నిషేధిస్తూ మరో ప్రత్యేక ఉత్తర్వులు వెలువరించారు. వీటిని ఉల్లంఘిస్తే.. అటువంటి వ్యక్తులు విచారణ ఎదుర్కొవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.


తోట‌ వంశీ కుమార్‌

Next Story