'లేపాక్షి గ్రూప్' ప్రత్యేకత.. ఇన్ని దశాబ్దాలుగా సాగిన ప్రయాణం మీకోసం!!

ఫర్నిచర్ షాపుల రిటైల్ వ్యాపారంలో నాచారంలోని లేపాక్షి ఫర్నీచర్స్ బాగా ప్రసిద్ధిని సొంతం చేసుకుంది. 6 దశాబ్దాలుగా 'లేపాక్షి గ్రూప్' తనకంటూ ఓ గొప్ప స్థానాన్ని సొంతం చేసుకుంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 March 2024 1:51 AM GMT
Lepakshi Group, Hyderabad

'లేపాక్షి గ్రూప్' ప్రత్యేకత.. ఇన్ని దశాబ్దాలుగా సాగిన ప్రయాణం మీకోసం!!

హైదరాబాద్‌లోని సందడిగా ఉండే వీధుల్లో ఫర్నిచర్ షాపులు కూడా ఎంతో మందిని ఆకర్షిస్తూ ఉన్నాయి. ఫర్నిచర్ షాపుల రిటైల్ వ్యాపారంలో నాచారంలోని లేపాక్షి ఫర్నీచర్స్ బాగా ప్రసిద్ధిని సొంతం చేసుకుంది. ఆరు దశాబ్దాలుగా 'లేపాక్షి గ్రూప్' తనకంటూ ఒక గొప్ప స్థానాన్ని సొంతం చేసుకుంది. సరసమైన ధరతో.. అద్భుతమైన డిజైన్స్ తో.. లగ్జరీని అందిస్తోంది. లేపాక్షి గ్రూప్ విజయానికి కారకులైన ఒకరు రీతా అగర్వాల్ (RA).. న్యూస్ మీటర్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తమ కుటుంబం ప్రయాణం, ఈ విలువలు, భవిష్యత్తు ప్రణాళికల గురించి మనతో పంచుకున్నారు.

NM: లేపాక్షి గ్రూప్ ప్రయాణం గురించి మాకు సమాచారం అందించగలరా?

RA: మా ప్రయాణం 1947-48లో ప్రారంభమైంది. స్టీల్ ఫర్నీచర్‌ను తయారు చేసే చిన్న అవుట్‌లెట్‌ ను ప్రారంభించాము. అబిడ్స్ మెయిన్ రోడ్‌లోని విశాలమైన మా ఫ్లాగ్‌షిప్ షోరూమ్‌.. మా నాన్న షామ్ కుమార్ అగర్వాల్ స్థాపించారు. ఆ తరువాత నా తల్లి సుమిత్రా అగర్వాల్ బాధ్యతలు తీసుకున్నారు. మేము నాణ్యత, సరికొత్త డిజైన్ల పట్ల ఎప్పటికప్పుడు దృష్టి పెట్టి.. ఆ దిశగా అడుగులు వెళ్ళాము.

NM: లేపాక్షి గ్రూప్‌ను స్థాపించాలనే ఆలోచన ఎలా వచ్చింది. ఫర్నిచర్ పరిశ్రమలోకి ప్రవేశించడానికి మీ కుటుంబాన్ని ప్రేరేపించినది ఏమిటి?

RA: తరతరాలుగా ఫర్నిచర్ మా కుటుంబంలో అంతర్భాగంగా ఉంది. గుడ్‌విల్, నోటి మాటల ఆధారంగా నిర్మించిన పునాదిపై.. అందమైన, క్రియాత్మకమైన ఫర్నీచర్ ను సృష్టించడమే మమ్మల్ని ఫర్నిచర్ పరిశ్రమలోకి ప్రవేశించడానికి ప్రేరేపించింది. అది మా అభిరుచిలో భాగమే.

NM: ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు వ్యాపారంలో భాగమై ఉన్నారు. లేపాక్షి విజయానికి కుటుంబం ఎలా కలిసిపోరాడింది.. ఈ విషయం గురించి మాతో పంచుకోగలరా?

RA: లేపాక్షిని సక్సెస్ చేసుకోడానికి మేము చాలానే కష్టపడ్డాం. మా కుటుంబం మొత్తం ఎంతో నిబద్ధతతో పని చేసింది. కలిసి పని చేయడం వలనే హైదరాబాద్ లోని ఫర్నీచర్ ప్రపంచంలో మాకంటూ ఓ గుర్తింపును సంపాదించుకోగలిగాం. పూర్తి పారదర్శకత, కస్టమర్లకు సంతృప్తిని ఇచ్చే విషయమై మేము ఎంతో నిబద్ధతతో పని చేశాం. ప్రతి ఒక్కరూ వారి ప్రత్యేక నైపుణ్యాన్ని ఇందులోకి తీసుకువస్తారు. లేపాక్షి నాచారం సక్సెస్ కు.. నేను నా తమ్ముడు గిరీష్ కుమార్, నా కోడలు శీతల్ అగర్వాల్, సోదరి అనితా షిండేతో కలిసి పనిచేశాం.

NM: మార్కెట్‌లోని ఇతర ఫర్నిచర్ బ్రాండ్‌ల నుండి లేపాక్షి గ్రూప్‌ ఎందుకు ప్రత్యేకమైంది. వ్యాపారాన్ని నిర్వహించడంలో మీ కుటుంబం ఏ విలువలు, సూత్రాలకు కట్టుబడి ఉంటుంది?

RA: లేపాక్షిలో.. ప్రతిఒక్కరికీ కావాల్సినవి అందించగలుగుతూ ఉన్నందుకు మేము గర్విస్తున్నాము. మా కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఫర్నీచర్ ను అందించడం మా ప్రత్యేకత. మా కలెక్షన్లు మా కస్టమర్ల అభిరుచులను ప్రతిబింబించేలా ఉంటాయి. మేము అందరి ఫర్నిచర్ అవసరాల కోసం పని చేస్తాం. ఇల్లు, హోటల్ ఫర్నిచర్ నుండి, కర్టెన్లు, బ్లైండ్‌లు, కిచెన్‌ల వార్డ్‌రోబ్‌లు, పెర్గోలాస్, కస్టమైజ్డ్ ఇంటీరియర్స్, ఆఫీస్ ఫర్నిచర్, అవుట్‌డోర్, గార్డెన్ ఫర్నిచర్ నుండి మేము అన్నింటినీ అందిస్తున్నాము.

NM: మీరు చాలా సంవత్సరాలుగా సాగుతున్న లేపాక్షి గ్రూప్ ప్రయాణం గురించి తెలియజేయగలరా? మీకు ఎదురైన సవాళ్లు ఏంటి?

RA: ఓం ప్రకాష్ షాపు నుండి లేపాక్షి గ్రూప్ కి మారిన తర్వాత, మేము అనేక సవాళ్లను ఎదుర్కొన్నాము. ముఖ్యంగా మా లీజు గడువు ముగిసినప్పుడు చాలా ఇబ్బందులే ఎదుర్కొన్నాం. అయితే, దృఢ సంకల్పంతో అన్ని కష్టాలను అధిగమించాం. మా క్లయింట్‌లు చెప్పేది వినడం, వారి ఫీడ్‌బ్యాక్ ఆధారంగా నిరంతరం మెరుగుపరుచుకోవడం మా వృద్ధికి కీలకంగా మారింది. మేము ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాలనే మా ప్రణాళికల పట్ల ఎంతో నిబద్ధతను కలిగి ఉన్నాం.

NM: లేపాక్షి గ్రూప్ గురించి మరిన్ని వివరాలను పంచుకోగలరా?

RA: ప్రస్తుతానికి లేపాక్షి గ్రూప్ చాలా ప్రాంతాల్లో విస్తరించి ఉంది. అబిడ్స్, బంజారా హిల్స్ రోడ్ నెం. 12 లో మేము ఇటాలియన్ ఫర్నిచర్ అమ్ముతున్నాం. మేము తెలంగాణలో ఇటాలియన్ ఫర్నిచర్ బ్రాండ్ 'మోల్తేని అండ్ దాదా' పేరుతో అమ్ముతూ ఉన్నాం. సింగపూర్ బ్రాండ్ 'హోమ్‌స్టోలైఫ్' మా ఫర్నిచర్ స్టోర్‌లలో ప్రత్యేకంగా విక్రయిస్తున్నాం. మేము ఇటీవల శరత్ సిటీ మాల్‌లో అందుకు సంబంధించిన స్టోర్‌ను కూడా ప్రారంభించాము. లేపాక్షికి సంబంధించిన ఈ అంశాలన్నింటిని నా పెద్ద సోదరుడు దీపక్ అగర్వాల్.. వదిన నంద అగర్వాల్ చూసుకుంటున్నారు.

మా కిచెన్‌లు, వార్డ్‌రోబ్‌ల విభాగం, ఇంటీరియర్‌లకు మా బావ హర్షల్ షిండే నాయకత్వం వహిస్తున్నారు. 'ఇన్‌హాబిట్ ఇండియా' అని పిలువబడే మరో బ్రాంచ్ బాధ్యతలను అక్క నీతా కుమార్, ఆమె భర్త చైతన్య కుమార్‌తో కలిసి రోడ్ నెం.12, బంజారా హిల్స్ లో స్టోర్ ను చూస్తూ ఉన్నారు. అలాగే ఢిల్లీ MG రోడ్ లో కూడా బ్రాంచ్ ఉంది.

NM: ఫర్నిచర్ పరిశ్రమలో ప్రముఖ పేరుగా, ఎప్పటికప్పుడు మారుతున్న మార్కెట్ లో.. లేపాక్షి గ్రూప్ వినూత్నంగా ఎలా మారింది?

RA: IKEA వంటి గ్లోబల్ బ్రాండ్‌ల నుండి పోటీని ఎదుర్కొంటున్నాం. మా ఉత్పత్తుల నాణ్యత ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉన్నాం. మా నైపుణ్యాన్ని కూడా మా ప్రోడక్ట్స్ లో చూపిస్తూ ఉన్నాం. ఒక సంవత్సరం ఉచిత వారంటీని, జీవితకాల సేవను అందిస్తూ ఉండడం వలన మమ్మల్ని కేవలం రిటైలర్లుగా మాత్రమే కాకుండా, మేము కస్టమర్ అంచనాలను అందుకోడానికి అంకితమైన తయారీదారులుగా కూడా మారాము.

NM: మీ కుటుంబం సంస్థ విలువలను ఎలా మార్చుతోంది?

RA: మా కుటుంబంలోని ప్రతి సభ్యుడు వివిధ ఐడియాలతో వస్తూ ఉంటారు. మా వ్యాపార పద్ధతులను మెరుగుపరచడానికి మేము వాటిని ఉపయోగిస్తాము. మా ప్రధాన విలువ మా క్లయింట్‌ల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం, కస్టమర్లను సంతృప్తి చెందేలా చేయడమే మా అత్యంత ప్రాధాన్యతగా చూసుకుంటూ ఉన్నాం.

NM: దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన లేపాక్షి గ్రూప్ భవిష్యత్తులో ఆధునిక పోకడలు, సాంకేతికతలను అందిపుచ్చుకుంటూ తన వారసత్వాన్ని ఎలా నిలబెట్టుకోవాలని ప్లాన్ చేస్తోంది?

RA: ఎప్పటికప్పుడు మారుతున్న మార్కెట్‌లో చురుగ్గా ఉండడం చాలా ముఖ్యం. ఒక అడుగు ముందుకు వేయడం ద్వారా.. ఆధునిక పోకడలు, సాంకేతికతలను ఉపయోగించుకోవడం ద్వారా ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. లేపాక్షి సంస్థ నాణ్యతను కొనసాగిస్తూ మా పరిధిని విస్తరించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. బంజారాహిల్స్‌లో మరో దుకాణాన్ని ప్రారంభించబోతున్నాం. జాతీయ స్థాయిలో విస్తరించే ప్రణాళికలు కూడా ఉన్నాయి. క్వాలిటీ విషయంలో మా నిబద్ధత తిరుగులేనిది.

Next Story