టెస్టుల మీద టెస్టులు.. లేయర్స్ క్లినిక్ కు భారీ ఫైన్
రంగారెడ్డి జిల్లా వినియోగదారుల పరిష్కార కమీషన్ లేయర్స్ క్లినిక్‌ని భారీ ఫైన్ విధించింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 10 Jun 2024 9:33 PM ISTటెస్టుల మీద టెస్టులు.. లేయర్స్ క్లినిక్ కు భారీ ఫైన్
రంగారెడ్డి జిల్లా వినియోగదారుల పరిష్కార కమీషన్ లేయర్స్ క్లినిక్‌ని భారీ ఫైన్ విధించింది. శస్త్రచికిత్సకు ముందు అనవసరంగా అనేక సార్లు పరీక్షలు చేయించినందుకు పరిహారంగా రూ.1.05 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.
కేసు వివరాలు:
మాదాపూర్‌కు చెందిన డి అమిత్ (30) ఫిర్యాదు చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గతేడాది ఫిబ్రవరి 15న అమిత్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ, స్కిన్ ట్రీట్‌మెంట్ కోసం లేయర్స్ క్లినిక్‌ని సందర్శించారు. క్లినిక్‌లోని డాక్టర్ జ్యోతి.. సేల్స్‌పర్సన్ దినేష్ మాట్లాడుతూ.. మేనేజ్‌మెంట్ కొత్త డైరెక్ట్ హెయిర్ ఇంప్లాంటేషన్ (డిహెచ్‌ఐ) సర్జన్‌ను నియమిస్తున్నట్లు అమిత్‌కి తెలియజేసారు. శస్త్రచికిత్స కోసం కొద్దిరోజులు వేచి ఉండమని అమిత్‌ని కోరారు.
ప్రాథమిక వైద్య చికిత్సలు ప్రభావవంతంగా లేవు
ఈలోగా రెండు నెలలు గడిచింది. సర్జరీ కోసం డేట్ ఫిక్స్ చేశారు. సర్జరీకి డబ్బు చెల్లించాలని అమిత్ ను సేల్స్ పర్సన్ ఒత్తిడి చేశాడు. దినేష్ అభ్యర్థన మేరకు, అమిత్ 65,000 రూపాయలను ‘లోన్’గా తీసుకున్నాడు. ఇందులో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్, అండర్ ఆర్మ్స్, నెక్ స్కిన్ ట్రీట్‌మెంట్లు, లేజర్ ట్రీట్‌మెంట్, కెమికల్ స్కిన్ పీలింగ్ కోసం అంటూ చెల్లింపులు చెల్లింపులు జరిపించారు. మొదట లేయర్స్ క్లినిక్ సిబ్బంది 10 నిమిషాల చుండ్రు చికిత్సను చేయడం ప్రారంభించారు. అమిత్ తన జేబులో నుండి షాంపూలు, లోషన్లు వంటి పోస్ట్-కేర్ చికిత్సల కోసం చెల్లించాల్సి వచ్చింది.
వైద్యుని పర్యవేక్షణ లేకుండా చికిత్స చేయడం వల్ల కెమికల్ బర్న్స్ కు కారణమైంది:
వైద్యుల పర్యవేక్షణ లేకుండా చేసిన ట్రీట్మెంట్ కారణంగా అతడి చర్మం మీద కెమికల్ బర్న్ కు కారణమైంది. క్లినిక్ లోని అసిస్టెంట్ అమిత్ అండర్ ఆర్మ్స్, మెడకు ఓ రసాయనాన్ని పూయడంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యాడు. మండుతూ ఉండడం సాధారణమేనని చెప్పారని.. వారిస్తున్నా ఆ కెమికల్ పూస్తూనే ఉన్నారని అమిత్ వాపోయాడు. చర్మం మీద మంట దాదాపు మూడు గంటల పాటు కొనసాగింది, ఆ ప్రాంతాల్లో చర్మం గట్టిగా, ముడతలతో, ఎంతో నల్లగా మారింది. ఈ సమస్యలు ఒక వారం పాటు కొనసాగాయని, ఆ తర్వాత చర్మం రాలిపోవడం ప్రారంభించిందని, కాలిపోయిన చర్మం మాదిరిగానే అతని అండర్ ఆర్మ్స్, మెడలో భారీ నల్లటి మచ్చలు మిగిలిపోయాయని అమిత్ చెప్పారు. దీనిపై మేనేజ్మెంట్ ను అమిత్ ప్రశ్నించగా.. తాము సర్జరీని తప్పుగా చేశామని ఒప్పుకున్నారు.
నిర్దిష్ట క్లినిక్‌లోనే పరీక్షలు చేయాలని పట్టుబట్టారు:
హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు సమయం వచ్చినప్పుడు, లేయర్స్ కూకట్‌పల్లి బ్రాంచ్‌లో డిహెచ్‌ఐ వైద్యుడిని కలిశానని అమిత్ చెప్పాడు. అమిత్‌ని సర్జరీకి ముందు పలు పరీక్షలను చేయించుకోవాలని అడిగారు. అయితే, ప్రాథమిక సంప్రదింపుల తర్వాత మూడు వారాల తర్వాత మాత్రమే ఆ టెస్టులకు సంబంధించిన జాబితా అమిత్‌కు పంపారు. దీని వలన అతడి ట్రీట్మెంట్ లో గణనీయమైన జాప్యం జరిగింది.
అమిత్ హెచ్‌ఐవికి సంబంధించిన వైరల్ పరీక్షలతో సహా చాలా పరీక్షలు చేయించుకున్నాడు. అయితే, డాక్టర్ ఈ ఫలితాలను అంగీకరించలేదు. అమిత్‌ని వారు చెప్పిన క్లినిక్‌లోనే పరీక్షలను మళ్లీ చేయించుకోమని సూచించారు. అయినప్పటికీ, అమిత్ మెడ్‌ప్లస్‌ని సందర్శించి వైరల్ పరీక్షతో సహా మళ్లీ పరీక్షలు చేయించుకున్నాడు. కానీ డాక్టర్ వాటిని అంగీకరించడానికి నిరాకరించాడు. అమిత్ లేయర్స్ కు సంబంధించిన స్వంత క్లినిక్‌లలో ఒకదానిని మాత్రమే సందర్శించాలని మళ్లీ కోరారు. చాలా పరీక్షల కారణంగా అమిత్ అలసిపోవడమే కాకుండా.. రెండుసార్లు ఒకే పరీక్ష చేయించుకోవడం కోసం చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుందని మళ్లీ మళ్లీ పరీక్షలు చేసుకోడానికి ఇష్టపడటం లేదని కూడా చెప్పాడు.
అమిత్ తరపున లేయర్స్ సంస్థ మూడవ సారి టెస్టులకు కావాల్సిన డబ్బులను చెల్లించారు. కానీ ఫలితాలు మునుపటి రెండు పరీక్షలకు భిన్నంగా లేవు. డాక్టర్ మూడవసారి టెస్టులను కూడా అంగీకరించడానికి నిరాకరించాడు. నాలుగోసారి కూడా టెస్టులు చేసుకోవాలని కోరాడు. కానీ అమిత్ అందుకు నిరాకరించాడు.
లేయర్స్ క్లినిక్ డాక్టర్.. అమిత్‌ని తన వ్యక్తిగత వైద్యుడి నుండి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవడానికి అన్ని అర్హతలు ఉన్నాయని తెలిపేలా ధృవీకరణ పత్రాన్ని సమర్పించమని కూడా అడిగారు. అమిత్ డాక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. కాల్ సమయంలో కాన్ఫరెన్స్‌లో ఉన్న లేయర్స్ క్లినిక్ మేనేజర్ వారి మొత్తం సంభాషణను రికార్డ్ చేశారు. PrEP మందులు, దాని వినియోగం, ప్రభావానికి సంబంధించి NACO జారీ చేసిన మార్గదర్శకాలను కూడా అమిత్ కు అందించారు. అయితే, వివిధ కారణాలను చూపుతూ అమిత్‌కు శస్త్రచికిత్స చేయడానికి లేయర్స్‌లోని వైద్యులు నిరాకరించారు.
మరో క్లినిక్ ను ఆశ్రయించిన అమిత్:
అమిత్ తన హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం ఇంకో బ్రాంచ్ ను ఆశ్రయించాల్సి వచ్చింది. న్యూ రూట్స్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ క్లినిక్‌ని సంప్రదించవలసి వచ్చింది. ఆశ్చర్యకరంగా, ఆ క్లినిక్ లో ఎక్కువ టెస్ట్ లు చేయించుకోమని అడగకుండా శస్త్రచికిత్స చేసింది. అమిత్ ఆరోగ్యం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా.. అతని నుండి ఎక్కువ డబ్బు వసూలు చేయాలనే లేయర్స్ క్లినిక్ దురుద్దేశాన్ని ఇది బహిర్గతం చేసింది.
అమిత్ ఆ మొత్తాలను వాపసు చేయమని లేయర్స్ క్లినిక్‌ని కోరాడు. లేయర్స్ క్లినిక్ మొదట్లో లోన్‌ను క్లోజ్ చేసి, మొత్తాన్ని రీఫండ్ చేయడానికి అంగీకరించింది. అయితే, డబ్బులు తిరిగి ఇవ్వలేదు. ఎలాంటి ఆప్షన్ లేకపోవడంతో న్యాయం కోసం అమిత్ కమిషన్‌ను ఆశ్రయించారు. ఆగస్ట్ 3, 2023న, లేయర్స్ క్లినిక్‌కి లీగల్ నోటీసు పంపగా.. క్లినిక్ నుండి ఎలాంటి స్పందన రాలేదు.
సాక్ష్యాధారాల ఆధారంగా, క్లినిక్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని.. వ్యాపార పద్ధతుల విషయంలో అక్రమాలకూ పాల్పడిందని కమిషన్ తీర్పు చెప్పింది. 'లోపం, నిర్లక్ష్యం, అన్యాయమైన వ్యాపార విధానాలకు' పరిహారంగా రూ. 1.05 లక్షలు, వ్యాజ్య ఖర్చుల కోసం రూ. 5,000 క్లినిక్ అమిత్‌కు పరిహారం చెల్లించవలసి ఉంటుందని కమిషన్ పేర్కొంది. అమిత్ లీగల్ ఫీజు కింద రూ.5,000 చెల్లించాలని లేయర్ క్లినిక్‌ని సూచించింది.