బంజారా‌హిల్స్‌లో యువ‌తి కిడ్నాప్ క‌ల‌క‌లం.. ర‌క్షించాలంటూ కేక‌లు.. స్థానికులు వ‌చ్చేలోపే

Kidnapping of a young woman in Banjara Hills.హైద‌రాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఓ యువ‌తి కిడ్నాప్ క‌ల‌క‌లం రేపింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 March 2021 3:24 AM GMT
kidnapping of young woman

హైద‌రాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఓ యువ‌తి కిడ్నాప్ క‌ల‌క‌లం రేపింది. ద్విచ‌క్ర‌వాహ‌నాల్లో వ‌చ్చిన యువ‌కులు ఓ యువ‌తిని కిడ్నాప్ చేశారు. ఆ యువ‌తి ర‌క్షించాలంటూ కేక‌లు వేయ‌గా.. స్థానికులు వ‌చ్చే లోపే కిడ్నాప‌ర్లు పారిపోయారు. మంగ‌ళ‌వారం రాత్రి 10 గంట‌ల స‌మ‌యంలో దేవ‌ర‌కొండ బ‌స్తీలోని రోడ్డు నెంబ‌ర్‌3లో బైక్ పై వ‌చ్చిన ముగ్గురు యువ‌కులు బ‌ల‌వంతంగా ఓ యువ‌తిని బైకుపై ఎక్కించుకున్నాడు. ఆ యువ‌తి వారిని ఎదిరించే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికి లాభం లేక‌పోయింది. ఈక్ర‌మంలో సాయం చేయాలంటూ కేక‌లు వేసింది.

యువ‌తి కేక‌లు విన్న స్థానికులు ఇళ్ల‌లోంచి బ‌య‌ట‌కు వ‌చ్చి చూసే లోపే ఆ యువ‌కులు యువ‌తితో ప‌రార‌య్యారు. కిడ్నాప్‌పై సమాచారం అందుకున్న పోలీసులు అక్క‌డ‌కు చేరుకుని ఘ‌ట‌న‌పై ఆరా తీశారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. స‌మీపంలోని సీసీ పుటేజీల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.


Next Story