హైద‌రాబాద్ వాసుల‌కు అల‌ర్ట్‌.. నేడు ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు

KCR's Christmas dinner at LB Stadium: Here are traffic diversions for 21 Dec.బుధ‌వారం మ‌ధ్యాహ్నాం 2 గంట‌ల నుంచి రాత్రి 9

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Dec 2022 8:08 AM IST
హైద‌రాబాద్ వాసుల‌కు అల‌ర్ట్‌.. నేడు ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు

తెలంగాణ ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో నేడు(బుధ‌వారం) ఎల్బీ స్టేడియంలో క్రైస్త‌వ సోద‌రుల‌కు క్మిసస్ విందు ఇవ్వ‌నున్న నేప‌థ్యంలో స్టేడియం ప‌రిస‌ర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉండ‌నున్నాయి. బుధ‌వారం మ‌ధ్యాహ్నాం 2 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

ట్రాఫిక్ మ‌ళ్లింపు ఇలా..

- AR పెట్రోల్ పంప్ జంక్షన్ (పబ్లిక్ గార్డెన్స్) నుండి BJR విగ్రహం వైపు అనుమ‌తించ‌రు. AR పెట్రోల్ పంపు వద్ద నాంపల్లి, చాపెల్ రోడ్డు వైపు మళ్లించబడుతుంది.

- అబిడ్స్ నుండి వచ్చే ట్రాఫిక్ BJR సర్కిల్ వైపు అనుమతించబడదు. SBI గన్‌ఫౌండ్రీ వద్ద చాపెల్ రోడ్/నాంపల్లి స్టేషన్ రోడ్డు వైపు మళ్లించబడుతుంది.

- బషీర్‌బాగ్ నుండి BJR విగ్రహం వైపు అనుమ‌తించ‌రు. బషీర్‌బాగ్ వద్ద కింగ్ కోటి/ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ రోడ్డు వైపు మళ్లించబడుతుంది.

- సుజాత స్కూల్ లేన్ నుండి ఖాన్ లతీఫ్ ఖాన్ (KLK) భవనం వైపు అనుమ‌తించ‌రు. సుజాత స్కూల్ జంక్షన్ వద్ద నాంపల్లి స్టేషన్ రోడ్డు వైపు మళ్లించబడుతుంది.

ఈ జంక్ష‌న్ల‌లో ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం

పాత పోలీస్ కంట్రోల్ రూమ్, బషీర్‌బాగ్, BJR విగ్రహం సర్కిల్, SBI గన్‌ఫౌండ్రీ, అబిడ్స్ సర్కిల్, AR పెట్రోల్ పంప్ (పబ్లిక్ గార్డెన్స్), నాంపల్లి, KLK బిల్డింగ్, లిబర్టీ, రవీంద్ర భారతి, లక్డీకాపూల్, ఇక్బాల్ మినార్, హిమాయత్ నగర్, అసెంబ్లీ, MJ మార్కెట్, హైదర్‌గూడ జంక్ష‌న్ల‌లో బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంటల మధ్య ట్రాఫిక్ రద్దీ ఉండే అవ‌కాశం ఉంది.

ఆర్టీసీ బస్సులు :

రవీంద్ర భారతి నుంచి అబిడ్స్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను ఎల్‌బీ స్టేడియం మెయిన్ గేట్, అంటే ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ ముందు తప్పించి, ఏఆర్ పెట్రోల్ పంప్ (పబ్లిక్ గార్డెన్స్) వద్ద నాంపల్లి స్టేషన్ రోడ్డు వైపు మళ్లించాలని మ‌ళ్లీస్తారు.

Next Story