నుమాయిష్: జనాలను ఆకర్షిస్తున్న కాశ్మీరీ డ్రై ఫ్రూట్స్ స్టాల్
Kashmiri dry fruit sellers draw crowds at Numaish in Hyderabad. ప్రతి సంవత్సరం హైదరాబాద్ వేదికగా జరిగే వార్షిక సందడి 'నుమాయిష్'
By అంజి Published on 23 Jan 2023 10:44 AM IST
ప్రతి సంవత్సరం హైదరాబాద్ వేదికగా జరిగే వార్షిక సందడి 'నుమాయిష్' ఇటీవల నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సందర్శకుల కోసం ప్రారంభించబడింది. ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నుమాయిష్ 2023 సంవత్సరపు 82వ ఎడిషన్ ఫిబ్రవరి 15 వరకు నిర్వహించబడుతుంది. ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన అనేక స్టాల్స్‌లో ప్రసిద్ధ కాశ్మీరీ డ్రై ఫ్రూట్ స్టాల్ కూడా ఉంది. ఇది గత సంవత్సరాల మాదిరిగానే సందర్శకుల నుండి స్పెషల్ అట్రాక్షన్‌ను పొందింది.
గత 15 ఏళ్లుగా ఎగ్జిబిషన్‌లో డ్రై ఫ్రూట్స్ విక్రయిస్తున్న శ్రీనగర్‌కు చెందిన ఆసిఫ్ అలీ ఈ ఏడాది జరిగిన ఈవెంట్‌లో ఫుట్‌ఫాల్‌పై సంతోషం వ్యక్తం చేశారు. ''సంక్రాంతి పండుగ కారణంగా గత మూడు రోజులుగా మాకు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు. ఈ ఏడాది మంచి వ్యాపారం వస్తుందని ఆశిస్తున్నాం'' అని అన్నారు. ''ఇంతకుముందు మేము ఇక్కడ కాశ్మీరీ శాలువలను విక్రయించాము. ఈ సంవత్సరం మేము ఒరిజినల్ కాశ్మీరీ వాల్‌నట్, పిస్తా, బాదం, కుంకుమపువ్వు, తేనెలను కూడా విక్రయిస్తున్నాము. హైదరాబాద్‌లోని డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా కాలిఫోర్నియా నుండి దిగుమతి అవుతాయి, కాని మేము కాశ్మీర్ నుండి తీసుకువచ్చాము. ధరలు నాణ్యతపై ఆధారపడి ఉంటాయి. మేము అన్ని ధరల శ్రేణులలో ఉత్పత్తులను కలిగి ఉన్నాము'' అని చెప్పారు.
నుమాయిష్‌లోని ఫుడ్ స్టాల్స్‌లో వివిధ రకాల వంటకాలు ఉన్నాయి. అయితే ఎక్కువ మంది పిల్లలను ఆకర్షించడానికి ఈ సంవత్సరం ఈవెంట్‌లో స్వింగ్‌లు, రైడ్‌లు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. ఊర్మిళ అనే కస్టమర్ మాట్లాడుతూ.. ''ఇక్కడ ఉన్న అన్ని ఉత్పత్తులు చాలా బాగున్నాయి. ముఖ్యంగా వాల్‌నట్, బాదం. నేను ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ కొనడానికి తిరిగి వస్తాను'' అని చెప్పారు. మరొక కస్టమర్ తిరుమల్ కుమార్ మాట్లాడుతూ.. ''ప్రదర్శనలో ఉన్న డ్రై ఫ్రూట్స్ నాణ్యతను మెచ్చుకుంటూ కాశ్మీర్‌లో మనకు లభించే అన్ని రకాల డ్రైఫ్రూట్స్ ఇక్కడ లభిస్తాయి. ఇక్కడ లభించే రకరకాల బాదంపప్పులు అన్నిచోట్ల దొరకడం చాలా కష్టం'' అని అన్నారు.