హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రచార షెడ్యూల్ ఖరారు అయింది. ఈ మేరకు హైదరాబాద్ ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో సీఎం ప్రచారం ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, డివిజన్ల ఇన్‌చార్జ్‌లు హాజరయ్యారు.
కాగా ఈ నెల 31న వెంగళరావు నగర్, సోమాజిగూడ డివిజన్లలో ప్రచారం ప్రారంభించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. నవంబర్ 1న బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లలో ప్రచారం, నవంబర్ 4న షేక్ పెట్-1, రహమత్ నగర్ డివిజన్లలో ప్రచారం, నవంబర్ 5న షేక్ పెట్-2, యూసుఫ్ గూడ డివిజన్లలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. మరో వైపు రోజు సాయంత్రం గంట పాటు రోడ్ షో నిర్వహించనున్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్ని డివిజన్లను కవర్ చేస్తూ కాంగ్రెస్ చేపట్టనున్న బైక్ ర్యాలీలో సీఎం రేవంత్ పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.