హైదరాబాద్: త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ 40 మంది నాయకులను 'స్టార్ క్యాంపెయినర్లు'గా నియమించింది. ఈ జాబితాను అధికారికంగా ఎన్నికల సంఘానికి సమర్పించినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ తెలిపారు.
ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, ఎఐసిసి తెలంగాణ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఎఐసిసి కార్యదర్శి విశ్వనాథన్, టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, డి శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, పొన్నం ప్రభాకర్, సీతక్క, తుమ్మల నాగేశ్వర్ రెడ్డి. జూపల్లి కృష్ణారావులు లిస్ట్‌లో ఉన్న ప్రముఖులు.
సీనియర్ నేతలు జానా రెడ్డి, రేణుక చౌదరి, హనుమంతరావు, అజారుద్దీన్, సంపత్ కుమార్, దానం నాగేందర్, విజయశాంతి, అంజన్ కుమార్ యాదవ్, సీఎన్ రెడ్డి, రాములు నాయక్ తో పాటు బాబా ఫసియుద్ధి న్ లకు ఎన్నికల బాధ్యతలను కాంగ్రెస్ హై కమాండ్ అప్పగించింది.
ఈ జాబితాలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి, జి వివేక్ కూడా ఉన్నారు. తెలంగాణలో ఉప ఎన్నిక రాజకీయంగా ప్రాముఖ్యత సంతరించుకుంటున్నందున, జూబ్లీహిల్స్‌లో విస్తృత ప్రచారం కోసం కాంగ్రెస్ తన అగ్ర నాయకత్వాన్ని మోహరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.