Jubilee Hills Bypoll : బీఆర్‌ఎస్‌ 40 మంది స్టార్‌ క్యాంపెయినర్స్ వీరే..!

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి నవంబర్ 11న జరిగే ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనడానికి 40 మంది స్టార్ క్యాంపెయినర్లకు భారత ఎన్నికల సంఘం (ECI) నుండి BRS కు అనుమతులు లభించాయి.

By -  Medi Samrat
Published on : 21 Oct 2025 5:42 PM IST

Jubilee Hills Bypoll : బీఆర్‌ఎస్‌ 40 మంది స్టార్‌ క్యాంపెయినర్స్ వీరే..!

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి నవంబర్ 11న జరిగే ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనడానికి 40 మంది స్టార్ క్యాంపెయినర్లకు భారత ఎన్నికల సంఘం (ECI) నుండి BRS కు అనుమతులు లభించాయి. పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా అక్టోబర్ 18 నుండి నవంబర్ 9 వరకు సాయంత్రం 6 గంటల వరకు ఈ స్టార్ క్యాంపెయినర్లు ప్రచారంలో పాల్గొంటారు.

స్టార్ క్యాంపెయినర్లలో BRS అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు, ఎమ్మెల్యేలు టి. హరీష్ రావు, టి. శ్రీనివాస్ యాదవ్, టి. పద్మారావు, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు/








Next Story