హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక సందర్భంగా పోలీసులు రౌడీషీటర్లను బైండోవర్ చేశారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్ కుమార్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ సహా మరో 100 మంది రౌడీషీటర్లను పోలీసులు బైండోవర్ చేశారు. కాగా బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యధికంగా 74 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేశారు.
మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో చిన్న శ్రీశైలం యాదవ్, అతడి సోదరుడు రమేష్ యాదవ్‌తో సహా 19 మంది రౌడీ షీటర్లను పోలీసులు బైండోవర్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనతో పోలీసులు ఈ చర్యలు తీసుకుంటున్నారు. కాగా ఎన్నికల వేళ రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచినట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. ఎన్నికల వేళ కేసులు నమోదు అయితే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.