హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం బీజేపీ తన అభ్యర్థిని ఎట్టేకలకు ప్రకటించింది. ఈ మేరకు పార్టీ అధిష్టానం ప్రకటన విడుదల చేసింది. లంకల దీపక్ రెడ్డిని జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది.
కాగా నవంబర్ 11న జరగనున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు అభ్యర్థి ఎంపికపై బీజేపీ భారీ కసరత్తు చేసింది. ముగ్గురి పేర్లను షార్ట్ లిస్ట్ చేయగా లంకల దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి, వీరపనేని పద్మల పేర్లు ప్రధానంగా వినిపించాయి. ఆ ముగ్గురిలో ఒకరిని అధినాయకత్వం దీపక్‌రెడ్డిని ఎన్నుకుని, వారి పేరుని ఇవాళ ప్రకటించారు. అయితే ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించడమే కాకుండా.. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.