నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌.. 26న జాబ్ మేళా..పూర్తి వివ‌రాలివే..

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ బ్యూరో సహకారంతో అపోలో ఫార్మసీ ఆధ్వర్యంలో 100 మంది ఫార్మసిస్ట్‌లు, అసిస్టెంట్ ఫార్మసిస్టుల నియామకం కోసం నవంబర్ 26వ తేదీ మంగళవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

By Medi Samrat  Published on  23 Nov 2024 7:13 AM IST
నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌.. 26న జాబ్ మేళా..పూర్తి వివ‌రాలివే..

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ బ్యూరో సహకారంతో అపోలో ఫార్మసీ ఆధ్వర్యంలో 100 మంది ఫార్మసిస్ట్‌లు, అసిస్టెంట్ ఫార్మసిస్టుల నియామకం కోసం నవంబర్ 26వ తేదీ మంగళవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ట్స్‌ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయిమెంట్‌ బ్యూరో కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది.

హైదరాబాద్‌లో జరిగే జాబ్ మేళాకు 18 నుండి 35 సంవత్సరాల వయస్సు గల డి ఫార్మసీ, బి ఫార్మసీ లేదా ఎం ఫార్మసీ పూర్తి చేసిన అర్హత గల అభ్యర్థులు హాజరు కావాల్సిందిగా నిర్వాహకులు వెల్లడించారు. అందుబాటులో ఉన్న పోస్టులకు అర్హతలు, అనుభవం ఆధారంగా రూ. 14,800 నుండి రూ. 25,000 వరకు వేతనం ఉంటుంది.

మరిన్ని వివరాల కోసం, ఆసక్తిగల అభ్యర్థులు మానవ వనరుల (HR) విభాగం 82476 56356ను సంప్రదించవచ్చు. అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికేట్‌ల ఫోటోకాపీలను తీసుకురావాలని నిర్వాహ‌కులు సూచించారు.

Next Story