Hyderabad: ప్రముఖ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ రైడ్స్ కలకలం
కోట్లాది రూపాయల మేర అమ్మకాలు జరిపి పెద్ద ఎత్తున పన్ను ఎగవేతకు పాల్పడ్డారనే అనుమానంతో ఆదాయపు పన్ను శాఖ మంగళవారం నగరంలోని..
By - అంజి |
Hyderabad: ప్రముఖ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ రైడ్స్ కలకలం
కోట్లాది రూపాయల మేర అమ్మకాలు జరిపి పెద్ద ఎత్తున పన్ను ఎగవేతకు పాల్పడ్డారనే అనుమానంతో ఆదాయపు పన్ను శాఖ మంగళవారం నగరంలోని ప్రసిద్ధి చెందిన మూడు బిర్యానీ రెస్టారెంట్‌లలో దాడులు జరిగాయి. పిస్తా హౌస్, షా ఘౌస్, మెహ్ఫిల్ గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్లకు సంబంధించిన కార్యాలయాలు, నివాసాలలో బృందాలు సోదాలు జరుపుతుంది. 30 చోట్ల ఈ సోదాలు జరుగుతున్నాయి.
అధికారుల ప్రకారం.. మూడు హోటళ్లకు సంబంధించిన కార్యాలయాలు, ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. 2006లో కార్యకలాపాలు ప్రారంభించిన మెహ్ఫిల్.. ఇప్పుడు హైదరాబాద్ అంతటా 15 అవుట్‌లెట్‌లను నడుపుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు కూడా ఉనికిని విస్తరించింది. 2025 వరకు కొత్త అవుట్‌లెట్‌లను తెరవడం కొనసాగించింది.
1997లో మహ్మద్ అబ్దుల్ మజీద్ స్థాపించిన పిస్తా హౌస్.. భారత్, USA, UAE, ఒమన్, కువైట్‌లలో 44 స్టోర్‌లతో అంతర్జాతీయ బ్రాండ్‌గా ఎదిగింది. ప్రధాన కార్యాలయం షా అలీ బండలో ఉంది. పిస్తా హౌస్ అవుట్‌లెట్‌లు హైదరాబాద్ అంతటా, రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి.
రెగ్యులర్ డైన్ ఇన్ సేల్స్ కాకుండా.. పిస్తా హౌస్ గణనీయమైన ఆన్‌లైన్ ఆర్డర్‌లు, ఫ్రాంచైజీ-ఆధారిత వ్యాపారాన్ని చేస్తుందని అధికారులు గుర్తించారు. ముఖ్యంగా హలీమ్ సీజన్‌లో అమ్మకాలు అనేక కోట్లకు పెరిగాయి. ముఖ్యంగా ఈ బ్రాండ్‌కు జనాదరణ ఎక్కువ. ఎన్నో సంవత్సరాలుగా నటుడు సల్మాన్ ఖాన్‌తో సహా అనేక మంది హై-ప్రొఫైల్ వ్యక్తులను కూడా ఈ బ్రాండ్ వంటలు ఆకర్షించాయి.
గచ్చిబౌలి, ఓల్డ్ సిటీతో సహా పలు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న షా గౌస్‌లో కూడా సోదాలు జరుగుతున్నాయి. నగరంలోని ప్రధాన ఆహార-అగ్రిగేటర్ ప్లాట్‌ఫారమ్‌లలో షా గౌస్‌లో కూడా ఒకటి. ఈ రెస్టారెంట్ కూడా గణనీయమైన అమ్మకాలు జరిపినట్లు అధికారులు గుర్తించారు.
అనుమానిత పన్ను ఎగవేత విచారణలో భాగంగా దర్యాప్తు బృందాలు ఆర్థిక రికార్డులు, శాఖల వారీగా లావాదేవీలు ఇతర పత్రాలను పరిశీలించాయి. తదుపరి విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.