ఐపీఎల్‌కు సిద్ధమవుతోన్న ఉప్పల్ స్టేడియం..రూ.5 కోట్లతో పునరుద్ధరణ పనులు

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌ల కోసం హెచ్‌సీఏ నిర్వాహకులు స్టేడియాన్ని నూతన హంగులతో తీర్చిదిద్దారు

By Knakam Karthik  Published on  13 March 2025 12:51 PM IST
Hyderabad, Uppal Stadium, Ipl 2025

ఐపీఎల్‌కు సిద్ధమవుతోన్న ఉప్పల్ స్టేడియం..రూ.5 కోట్లతో పునరుద్ధరణ పనులు

క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఐపీఎల్ సీజన్ త్వరలోనే ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌ల కోసం హెచ్‌సీఏ నిర్వాహకులు స్టేడియాన్ని నూతన హంగులతో తీర్చిదిద్దారు. ఈ ఏడాది జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మొత్తం తొమ్మిది మ్యాచ్‌లకు ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.

ఐపీఎల్ సీజన్‌కు ముందు ఉప్పల్ స్టేడియం పునరుద్ధరణ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) రూ.5 కోట్లు ఖర్చు చేసింది. స్టేడియానికి కొత్త రూపం ఇచ్చే దిశగా మార్పులు చేపట్టాం. స్టేడియం మొత్తం పెయింట్ వేయించాం. నార్త్ స్టాండ్స్‌లో కొత్త విశ్రాంతి గదులు నిర్మిస్తున్నారు. క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్‌లు, కార్పొరేట్ బాక్స్‌లలో ఏసీలు, టైల్స్ మార్చాం. అని హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు అన్నారు.

ఉప్పల్ స్టేడియంలో ఏడు లీగ్ మ్యాచ్‌లు, క్వాలిఫైయర్, ఎలిమినేటర్ మ్యాచ్‌తో సహా రెండు అదనపు మ్యాచ్‌లను నిర్వహిస్తున్నాం. హోమ్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌లో తన తొలి మ్యాచ్‌లను మార్చి 23వ తేదీన ఉప్పల్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది.

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈ ఐపీఎల్ కోసం, స్టేడియంలోని మురికిగా ఉన్న రెస్ట్‌రూమ్‌ల గురించి సోషల్ మీడియా పోస్ట్‌లను ప్రత్యేకంగా గమనించింది. రెస్ట్‌రూమ్‌లు, కార్పొరేట్ బాక్స్‌లు, కానాప్‌లు, లైటింగ్, సీటింగ్, కామన్ ఏరియా క్లీనింగ్, గేట్లను HCA పునరుద్ధరించింది. ఐపీఎల్ ఆటలను నిర్వహించడానికి, క్రికెట్ ప్రియులకు మెరుగైన అనుభవాన్ని అందించడానికి హైదరాబాద్‌ను దేశంలోనే అత్యుత్తమ వేదికగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని HCA ప్రెసిడెంట్ పేర్కొన్నారు.

Next Story