Hyderabad: హోటల్‌లో యువకుడు హల్‌చల్, కానిస్టేబుల్‌పై దాడి
హైదరాబాద్‌లో ఓ యువకుడు పీకల దాకా మద్యం సేవించి నానా రచ్చ చేశాడు.
By Srikanth Gundamalla Published on 11 March 2024 12:30 PM ISTHyderabad: హోటల్‌లో యువకుడు హల్‌చల్, కానిస్టేబుల్‌పై దాడి
మద్యం మత్తులో మందుబాబులో ఎప్పుడేం చేస్తారో అర్థం కాదు. రోడ్లపైకి వచ్చి నానా హంగామా సృష్టిస్తుంటారు. అడ్డొచ్చినవారితో గొడవ పెట్టుకుంటారు. తాజాగా హైదరాబాద్‌లో కూడా ఓ యువకుడు పీకల దాకా మద్యం సేవించి నానా రచ్చ చేశాడు. హోటల్‌లోకి వెళ్లి టిఫిన్ చేశాడు. తర్వాత బిల్లు కట్టమని అడిగినందుకు దాడికి తెగబడ్డాడు. అంతేకాదు.. మద్యలో వచ్చి అడ్డుకున్న పోలీస్ కానిస్టేబుల్‌పైనా చేయి చేసుకున్నాడు. ఈ దృశ్యాలన్నీ హోటల్‌లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయిజ
ఈ సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో రాజ్ యాదవ్ అనే యువకుడు పీకల దాకా మద్యం సేవించాడు. ఆ తర్వాత కేపీహెచ్‌బీ పరిధిలో ఉన్న ఓ హోటల్‌కు వెళ్లాడు. అక్కడ టిఫిన్ ఆర్డర్ చేసి.. పీకలదాకా తిన్నాడు. చివరకు ఆ హోటల్ యజమానురాలు బిల్లు కట్టాలని యువకుడిని అడిగింది. దాంతో.. ఆ తాగుబోతు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. టిఫిన్ ఫ్రీగా ఎందుకు ఇవ్వవంటూ నానా గొడవ చేశాడు. హోటల్ యజమానురాలిపై దాడికి ప్రయత్నించాడు. దాంతో... అక్కడున్న పలువురు తాగుబోతుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. రాజయ్ యాదవ్ వారిపై కూడా దాడి చేశాడు.
యువకుడు హోటల్‌లో దూరి హంగామా చేస్తున్నాడని గ్రహించిన అక్కడే ఉన్న కానిస్టేబుల్ శశికాంత్ హోటల్‌కు వచ్చాడు. రాజు యాదవ్‌ను అడ్డుకోబోయాడు. ఫుల్లుగా మద్యం సేవించి ఉన్న యువకుడు.. ఎదురుగా ఉన్నది పోలీసు అని కూడా చూడకుండా కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నాడు. అంతేకాదు.. తాను ఒక రాజకీయ నేతకు అనుచరుడిని అంటూ హల్‌చల్ చేశాడు. ఇక కాసేపటికి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేయగా.. పోలీసులు అతడిని పట్టుకున్నాడు. నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. హోటల్ యజమానురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. యువకుడు రచ్చ చేసిన దృశ్యాలు హోటల్‌లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ హోటల్‌లో యువకుడు హల్‌చల్
— Newsmeter Telugu (@NewsmeterTelugu) March 11, 2024
చేసిన టిఫిన్‌కు బిల్లు కట్టమన్నందుకు యజమానురాలితో గొడవ
అడ్డొచ్చిన వారిపై మద్యం మత్తులో దాడి, కానిస్టేబుల్‌పైనా చేయిచేసుకున్న యువకుడు pic.twitter.com/R4KwTou6mn