ఉద్యోగం ఇస్తామంటూ హైదరాబాద్‌ తీసుకొచ్చి వ్యభిచారం.. ఆరుగురు అరెస్ట్‌

International human trafficking racket busted by Rachakonda police. హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ మహిళల అక్రమ రవాణా ముఠా గుట్టు రట్టైంది. బంగ్లాదేశ్‌ నుంచి మహిళలను తరలిస్తున్న

By అంజి  Published on  22 July 2022 9:44 AM GMT
ఉద్యోగం ఇస్తామంటూ హైదరాబాద్‌ తీసుకొచ్చి వ్యభిచారం.. ఆరుగురు అరెస్ట్‌

హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ మహిళల అక్రమ రవాణా ముఠా గుట్టు రట్టైంది. బంగ్లాదేశ్‌ నుంచి మహిళలను తరలిస్తున్న అక్రమ రవాణా ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు బాధితులు, మైనర్ బాలికతో సహా ఇద్దరు సోదరీమణులను రక్షించారు. హైదరాబాద్, మహారాష్ట్ర, రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఈ రాకెట్ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అక్రమార్కులు బాధితులను ప్రలోభపెట్టి నకిలీ గుర్తింపు పత్రాలతో హైదరాబాద్‌ నగరానికి తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని పోలీసులు తెలిపారు. బలవంతంగా మాంసం వ్యాపారం చేయించేందుకు తన 15 ఏళ్ల సోదరిని ముఠా సభ్యులు మహారాష్ట్రకు తీసుకెళ్తున్నారని బాధితురాలు ఉప్పల్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ రాకెట్ వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధులతో పాటు దేశంలోని ఇతర నగరాల్లో ఈ రాకెట్‌ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

Next Story