శంషాబాద్‌ విమానాశ్రయంలో ఇండిగో విమానం అత్య‌వ‌స‌ర ల్యాండింగ్‌

ఇండిగోకు చెందిన విమానం ఒక‌టి మంగళవారం ఉదయం అత్య‌వ‌స‌రంగా హైద‌రాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్ర‌యంలో ల్యాండింగ్ చేశారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 April 2023 10:49 AM IST
శంషాబాద్‌ విమానాశ్రయంలో ఇండిగో విమానం అత్య‌వ‌స‌ర ల్యాండింగ్‌

ఇండిగోకు చెందిన విమానం ఒక‌టి మంగళవారం ఉదయం అత్య‌వ‌స‌రంగా హైద‌రాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్ర‌యంలో ల్యాండింగ్ చేశారు. 6E897 నంబ‌ర్ గ‌ల ఇండిగో విమానం ఉద‌యం 5.10 గంట‌ల‌కు బెంగళూరు నుంచి వారణాసికి బయలుదేరింది. అయితే.. విమానంలో సాంకేతిక స‌మ‌స్య త‌లెత్తింది. గ‌మ‌నించిన పైలెట్ వెంట‌నే అధికారుల‌కు స‌మాచారం ఇచ్చారు.

వారి ఆదేశాల అనుసారం దారి మ‌ళ్లించి ఉదయం 6:15 గంటలకు శంషాబాద్ రాజీవ్ గాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో ల్యాండింగ్ చేశారు. విమానంలో 137 మంది ప్ర‌యాణీకులు ఉన్నారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించింది. ప్ర‌యాణీకుల కోసం మ‌రో విమానాన్ని ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిసింది

Next Story