హైదరాబాద్: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆయన నివాసం వద్దకు చేరకుని పోలీస్ స్టేషన్‌కు రావాలని అడిగారు. వారికి సహకరించిన అర్జున్ వారితో పాటు వెళ్లారు. ఆయన వెంటనే అల్లు అరవింద్ కూడా వెళ్లాలని చూడగా పోలీసులు వద్దని సూచించారు. ఈ క్రమంలోనే ఆందోళనలో ఉన్న తన భార్య స్నేహారెడ్డికి అర్జున్ ధైర్యం చెప్పి వెళ్లిపోయారు. పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు.