ప్రముఖ సంగీత స్వరకర్త ఇళయరాజా రేపు(ఫిబ్రవరి 26 ఆదివారం) హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ప్రదర్శన ఇవ్వనున్నారు. ఇళయరాజా లైవ్ కన్సర్ట్‌కు దాదాపు 17 వేల మందికి పైగా హాజరు అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నాం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
మళ్లింపులు ఇలా..
- లింగంపల్లి నుంచి గచ్చిబౌలి సర్కిల్ వచ్చే వాహనాలు హెచ్‌సీయూ డిపో వద్ద ఎస్‌ఎంఆర్ వినయ్ సిటీ, మజిద్‌బండ, బొటానికల్ గార్డెన్, గచ్చిబౌలి వైపు వెళ్లాల్సి ఉంటుంది.
- గచ్చిబౌలి సర్కిల్ నుంచి లింగంపల్లికి వెళ్లే ట్రాఫిక్‌ను గచ్చిబౌలి సర్కిల్, బొటానికల్ గార్డెన్,హెరిటేజ్,మజిద్‌బండ విలేజ్,SMR వినయ్, HCU డిపో వైపు వెళ్లాల్సి ఉంటుంది.
- రాయదుర్గం నుంచి లింగంపల్లికి వచ్చే ట్రాఫిక్ తప్పనిసరిగా ఐఐఐటీ వద్ద మళ్లించి, గోపీచంద్ అకాడమీ మీదుగా విప్రో సర్కిల్‌కు వెళ్లాలి. క్యూ సిటీ, గౌలిదొడ్డి, గోపన్‌పల్లి తండా, నల్లగండ్ల ఫ్లైఓవర్ నుంచి లింగంపల్లి వెళ్లాలన్నారు.
కింది మార్గాల్లో భారీ వాహనాలపై ఆంక్షలు:
సైబరాబాద్ పరిధిలోని గచ్చిబౌలి సర్కిల్ నుంచి లింగంపల్లి వైపు, లింగంపల్లి నుంచి గచ్చిబౌలి సర్కిల్ వైపు భారీ వాహనాలు అంటే ట్రక్కులు, లారీలు, డీసీఎంలు, ఆర్‌ఎంసీలు, వాటర్ ట్యాంకర్లను అనుమతించరు.