హైదరాబాద్‌లోని ఫార్మా కంపెనీల్లో ఐటీ సోదాలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. హైదరాబాద్‌ నగరంలో గత కొద్ది రోజులుగా ఐటీ సోదాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.

By అంజి  Published on  13 Nov 2023 4:48 AM GMT
IT searches, pharma companies, Hyderabad

హైదరాబాద్‌లోని ఫార్మా కంపెనీల్లో ఐటీ సోదాలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. హైదరాబాద్‌ నగరంలో గత కొద్ది రోజులుగా ఐటీ సోదాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నాయకులే లక్ష్యంగా ఐటీ సోదాలు జరగ్గా.. నేడు ప్రముఖ ఫార్మా కంపెనీ పైన ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లోని కొన్ని ఫార్మా కంపెనీల ఆవరణలో ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) సోమవారం సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఫార్మా కంపెనీల డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఈ తెల్లవారుజామున 10 ఐటీ అధికారుల బృందాలు సోదాలు ప్రారంభించాయి. పన్ను ఎగవేతపై వచ్చిన ఫిర్యాదులపై ఐటీ అధికారులు ఆర్థిక లావాదేవీల రికార్డులను తనిఖీ చేశారు. ఆర్‌సి పురంలోని నాగులపల్లి, అమీన్‌పూర్‌లోని పటేల్‌గూడ, గచ్చిబౌలిలో సోదాలు జరిగాయి. గచ్చిబౌలి ప్రాంతంలోని మై హోమ్ భూజా, హైలెవల్‌ అపార్ట్‌మెంట్లలోని ఫార్మా కంపెనీలకు చెందిన కొందరు ఉన్నతాధికారుల ఫ్లాట్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

Next Story