Hyderabad: అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా

హైదరాబాద్‌: నగరంలో హైడ్రా దూకుడు కొనసాగుతోంది. అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝళిపిస్తూ ముందుకు సాగుతోంది.

By అంజి  Published on  22 Sep 2024 5:49 AM GMT
HYDRAA, Illegal Constructions, Ameenpur

Hyderabad: అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా  

హైదరాబాద్‌: నగరంలో హైడ్రా దూకుడు కొనసాగుతోంది. అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝళిపిస్తూ ముందుకు సాగుతోంది. సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కృష్టారెడ్డిపేట 12వ సర్వే నంబర్ లో నిర్మించిన అక్రమ నిర్మాణాల కూల్చివేత పర్వం కొనసాగుతోంది. పటేల్ గూడ గ్రామానికి చెందిన పట్టా సర్వేనెంబర్ 6 పేరుతో క్రిష్టారెడ్డిపేట గ్రామం 12వ ప్రభుత్వ సర్వే నంబర్ లో నిర్మించిన సుమారు 16 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లుగా హైడ్రా గుర్తించింది. హైడ్రా ఆదేశాల మేరకు రెవెన్యూ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో కూల్చివేతలు మొదలయ్యాయి.

ఈ నిర్మాణాలు ఓ ప్రముఖ బిఆర్ఎస్ నేత నిర్మించారని హైడ్రా గుర్తించింది. ఈ కూల్చివేత సమయంలో అధికారులు మీడియాను అనుమతించలేదు. అధికారులు జంబో హిటాచితో క్రిష్టారెడ్డిపేటలో కూల్చివేతలు పనులు చేపట్టారు. అయితే జనాలు ఈ కూల్చివేతలను చూడటానికి భారీగా అక్కడికి తరలి వచ్చారు. పోలీసులు కూల్చి వేతల పరిసరాల్లో ఎవ్వరిని ఎవ్వరిని రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కూల్చివేతలను పటాన్చెరు డీఎస్సీ రవీందర్ రెడ్డి పరిశీలిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిర్మాణంలో ఉన్న ఒక భారీ ఆసుపత్రిని కూడా హైడ్రా కూల్చి వేసింది.

అటు కట్టుదిట్టమైన పోలీసు భద్రత మధ్య కూకట్‌పల్లిలోని నల్ల చెరువులో అనధికారిక నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. నల్ల చెరువు విస్తీర్ణం 27 ఎకరాలు కాగా 14 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో 7 ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. పైగా పక్కా భవనాలు, అపార్ట్‌మెంట్లు నిర్మించారు. 3 ఎకరాల ఎఫ్‌టిఎల్‌లో 25 భవనాలు, 16 షెడ్‌లు ఉన్నాయి. నివాస భవనాలు మినహా నల్లచెరువుపై నిర్మించిన 16 షెడ్లను అధికారులు కూల్చివేస్తున్నారు.

Next Story