Hyderabad: లులూ మాల్‌కు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఫైవ్ స్టార్‌ రేటింగ్‌

హైదరాబాద్: లులూ హైపర్‌మార్కెట్.. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి ఫైవ్‌ స్టార్‌ పరిశుభ్రత రేటింగ్‌ను పొందింది.

By అంజి  Published on  31 July 2024 9:30 AM IST
Hyderabad, Lulu Mall , Five Star Rating, FSSAI

Hyderabad: లులూ మాల్‌కు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఫైవ్ స్టార్‌ రేటింగ్‌

హైదరాబాద్: లులూ హైపర్‌మార్కెట్.. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి ఫైవ్‌ స్టార్‌ పరిశుభ్రత రేటింగ్‌ను పొందింది. వినియోగదారులకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిస్తూ ఆహార నిర్వహణ, తయారీ, నిల్వలో అవుట్‌లెట్ ఉత్తమ పద్ధతులను పాటిస్తోందని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తెలిపింది.

విస్తృత శ్రేణి రిటైల్ అవుట్‌లెట్‌లు, డైనింగ్‌ ఆప్షన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ సౌకర్యాలను కలిగి ఉన్న షాపింగ్ డెస్టినేషన్ లులూ హైపర్‌ మార్కెట్‌ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) నుండి ఫైవ్‌ స్టార్‌ పరిశుభ్రత రేటింగ్‌ను పొందింది. లులూ మార్కెట్‌లో వివిధ పారామితులను ముఖ్యంగా పరిశుభ్రత, తెగులు నియంత్రణ, సిబ్బందికి శిక్షణ మూల్యాంకనం చేసిన తర్వాత ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఫైవ్‌ స్టార్‌ రేటింగ్ ఇచ్చింది.

"ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుండి ప్రతిష్టాత్మకమైన గుర్తింపును పొందడం మాకు గౌరవంగా ఉంది. పరిశుభ్రమైన ప్రమాణాలను నిర్వహించడానికి, మా వినియోగదారులకు సురక్షితమైన, అధిక-నాణ్యత కలిగిన ఆహార ఉత్పత్తులను అందించడానికి మేము ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టము" అని లులూ మార్కెట్‌ జనరల్‌ మేనేజర్‌ ఎంవీ విమేష్ చెప్పారు.

"మా కస్టమర్‌లకు అత్యుత్తమ షాపింగ్ అనుభవాన్ని అందించాలనే మా మిషన్‌కు ఆహార భద్రత అత్యంత ప్రధానమని మేము విశ్వసిస్తున్నాము. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుండి ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ను అందుకోవడం, మేము చేసే ప్రతి పనిలో శ్రేష్ఠత కోసం మా అంకితభావాన్ని బలపరుస్తుంది" అని ప్రెష్‌ ఫుడ్‌ మేనేజర్‌ లెనిన్ తెలిపారు. లులు హైపర్‌మార్కెట్ సమగ్ర ఆహార భద్రత నిర్వహణ వ్యవస్థను అమలు చేసిందని, ఇందులో రెగ్యులర్ స్టాఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లు, కఠినమైన శుభ్రపరిచే ప్రోటోకాల్‌లు, ఆహార భద్రతా పద్ధతులపై నిరంతర పర్యవేక్షణ ఉన్నాయి.

Next Story