హమ్మయ్య.. ఆ ఫ్లై ఓవర్ తెరవనున్నారు

హైదరాబాద్‌లోని ఆరామ్‌ఘర్ నుండి జూ పార్క్ ఫ్లైఓవర్ త్వరలోనే ప్రారంభంకానుంది. ఈ ఫ్లై ఓవర్ తర్వాత అరమ్‌ఘర్ - బహదూర్‌పురా మధ్య ట్రాఫిక్ సమస్యను తగ్గిస్తుంది.

By అంజి  Published on  5 Jan 2025 5:15 PM IST
Hyderabad, Aramghar flyover

హమ్మయ్య.. ఆ ఫ్లై ఓవర్ తెరవనున్నారు

హైదరాబాద్‌లోని ఆరామ్‌ఘర్ నుండి జూ పార్క్ ఫ్లైఓవర్ త్వరలోనే ప్రారంభంకానుంది. ఈ ఫ్లై ఓవర్ తర్వాత అరమ్‌ఘర్ - బహదూర్‌పురా మధ్య ట్రాఫిక్ సమస్యను తగ్గిస్తుంది. జనవరి 6 హైదరాబాద్‌లో ఆరామ్‌ఘర్ ఫ్లైఓవర్ ప్రారంభ తేదీగా నిర్ణయించారు. సాయంత్రం 4 గంటలకు ప్రజల సందర్శనార్థం తెరవనున్నారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు.

హైదరాబాద్ ఎంపీ, ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు. జూ పార్క్ ఫ్లైఓవర్ వైపు ప్రారంభోత్సవం జరగనుంది. ఈ ఫ్లై ఓవర్ ను డిసెంబర్ 3, 2024న ప్రారంభించాలని మొదట నిర్ణయించారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ముఖ్యమంత్రి చేత ప్రారంభించాలని అనుకోవడంతో ఆరామ్‌ఘర్ ఫ్లైఓవర్ ప్రారంభం వాయిదా పడింది. ఈ ఫ్లైఓవర్ 4.04 కిలోమీటర్లు ఉంది. ఇది హైదరాబాద్‌లో రెండవ పొడవైన ఫ్లైఓవర్‌. ఆరు-లేన్ లు ఉంటుంది. ఇది ఆరామ్‌ఘర్‌ను నెహ్రూ జూలాజికల్ పార్క్‌తో కలుపుతుంది.

Next Story