అమెరికాలో భారీ వేతనంతో జాబ్ సాధించిన హైద‌రాబాద్ యువ‌తి

Hyderabad Young women gets job in america.హైదరాబాద్‌కు చెందిన యువతి దీప్తికి అమెరికాలోని ఓ ప్ర‌ముఖ కంపెనీలో భారీ జీతంతో ఉద్యోగం ల‌భించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 May 2021 8:40 AM GMT
hyderabad woman gets job in Usa

హైదరాబాద్‌కు చెందిన యువతి దీప్తికి అమెరికాలోని ఓ ప్ర‌ముఖ కంపెనీలో భారీ జీతంతో ఉద్యోగం ల‌భించింది. సియాటెల్ మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో రూ.2కోట్ల వార్షిక వేతనంతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం పొందింది. యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలో ఈ నెల 2న ఎంఎస్(కంప్యూటర్స్)పూర్తి చేసిన దీప్తి.. క్యాంపస్ ఇంటర్యూలో ఉద్యోగాన్ని సాధించింది. గోల్డ్‌మన్‌ సాక్స్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి సంస్థలు దీప్తికి ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. అయితే.. ఆమె మైక్రోసాఫ్ట్‌ వైపు మొగ్గుచూపారు.

ఈ నెల 17న‌ ఆమె ఉద్యోగ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆమె తండ్రి వెంకన్న హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో క్లూస్‌టీం విభాగం అధిపతిగా పని చేస్తున్నారు. బీటెక్ పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో దీప్తి మూడేళ్లపాటు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేశారు. అనంతరం ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లారు. ఈ క్రమంలో ఫ్లోరిడా యూనివర్సిటీలో ఎంపికైన 300 మందిలో దీప్తికి అత్యధిక వార్షిక వేతనం లభించడంపట్ల ఆమె తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Next Story