Hyderabad: లక్డీకాపూల్‌లో కంటైనర్‌ బోల్తా.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌.. వీడియో

లక్డీకాపూల్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. మూసాపేట నుంచి కాటేదాన్‌ స్వామి మూవర్స్‌కు చెందిన కంటైర్‌ పేపర్‌ బండిల్స్‌తో వెళ్తోంది.

By అంజి  Published on  24 Jan 2025 12:35 PM IST
Hyderabad, traffic,  container falls, Lakdikapul

Hyderabad: లక్డీకాపూల్‌లో కంటైనర్‌ బోల్తా.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌.. వీడియో

హైదరాబాద్‌: లక్డీకాపూల్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. మూసాపేట నుంచి కాటేదాన్‌ స్వామి మూవర్స్‌కు చెందిన కంటైర్‌ పేపర్‌ బండిల్స్‌తో వెళ్తోంది. లక్డీకాపూల్‌ ఎక్స్‌రోడ్‌లో అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. భారీ వాహనం రోడ్డుకు అడ్డుగా ఉండటంతో మెహదీపట్న వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ఈ ఘటనతో లక్డీకాపూల్‌లోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో ట్రాఫిక్‌ స్తంభించింది.

దీంతో ఖైరతాబాద్‌, మాసబ్‌ ట్యాంక్‌, నాంపల్లి వంటి పక్కనే ఉన్న మార్గాల్లో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ట్రాఫిక్‌ పోలీసులు భారీ క్రేన్‌ సహాయంతో కంటైనర్‌ను పక్కకు తొలగించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. ప్రయాణికులు తమ ప్రయాణాలను తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని, రద్దీలో చిక్కుకోకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని పోలీసులు సూచించారు.

Next Story