ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న ఉప్పల్‌ స్కైవాక్‌

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) రూ.25 కోట్లతో నిర్మించిన ఉప్పల్ స్కైవాక్ ప్రారంభోత్సవానికి

By అంజి  Published on  27 April 2023 10:13 AM GMT
Hyderabad,Uppal Skywalk, Mehdipatnam Skywalk

ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న ఉప్పల్‌ స్కైవాక్‌

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) రూ.25 కోట్లతో నిర్మించిన ఉప్పల్ స్కైవాక్ ప్రారంభోత్సవానికి హైదరాబాద్ ముస్తాబైంది. మెహిదీపట్నంలో కూడా ఇదే తరహాలో స్కైవాక్‌ను త్వరలో ప్రారంభించనున్నారు. ఆరు ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్లు కలిగిన ఉప్పల్‌లోని పాదచారులకు అనుకూలమైన ఈ సదుపాయం 37 స్తంభాలతో సపోర్ట్‌తో, ఆరు మీటర్ల వెడల్పుతో ఉంటుంది. స్కైవాక్‌లో ఎనిమిది ఎలివేటర్లు, ఆరు మెట్ల మార్గాలు, నాలుగు ఎస్కలేటర్‌లు ఉన్నాయి. ఇవి అందరికీ అందుబాటులో ఉంటాయి.

ఉప్పల్ స్కైవాక్

తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల సమస్యను పరిష్కరించేందుకు ఈ సౌకర్యం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణికులతో పాటు రోజూ 20 వేల మంది పాదచారులకు కూడా ప్రయోజనం చేకూరనుంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (ఎంఏ అండ్ యూడీ) మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రతిపాదించిన ఉప్పల్ స్కైవాక్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. నాగోల్ రోడ్, రామంతపూర్ రోడ్, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) థీమ్ పార్క్, జీహెచ్‌ఎంసీ కార్యాలయం సమీపంలోని వరంగల్ బస్ స్టాప్, ఉప్పల్ పోలీస్ స్టేషన్, ఉప్పల్ ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ ఎదురుగా ఉన్న రహదారి వైపు మెట్రో స్టేషన్‌లో హాప్-ఆన్ స్టేషన్లు వ్యూహాత్మకంగా ఉన్నాయి. ఈ స్కైవాక్ ప్రయాణీకులకు ఎలాంటి అవాంతరాలు లేని ప్రయాణాన్ని అందిస్తుంది.

మెహదీపట్నం స్కైవాక్

ఇదిలా ఉండగా, హైదరాబాద్‌లోని మెహదీపట్నం వద్ద మరో స్కైవాక్‌ను నిర్మించేందుకు సిద్ధమైంది. ఈ 390 మీటర్ల పొడవు గల స్కైవాక్‌లో 11 ఎలివేటర్లు ఉన్నాయి. పాదచారులు రద్దీగా ఉండే జంక్షన్‌లోని ఒక భాగం నుండి మరొక భాగానికి వెళ్లడానికి సహాయపడుతుంది. స్కైవాక్‌లో రైతు బజార్, డిఫెన్స్ కాంపౌండ్ వాల్, మెహదీపట్నం బస్ బే ఏరియా, ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్, గుడిమల్కాపూర్ జంక్షన్ సమీపంలో ఐదు హాప్-ఆన్ స్టేషన్లు ఉంటాయి. రద్దీగా ఉండే జంక్షన్‌ను దాటేందుకు ఇబ్బందులు పడుతున్న స్థానికులకు ఈ సౌకర్యం ఉపశమనం కలిగించనుంది.

హైదరాబాద్‌లోని స్కైవాక్‌లు పాదచారులకు సురక్షితమైన, సమర్థవంతమైన సౌకర్యాలను అందించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చొరవలో ఒక భాగం. నగరాన్ని పాదచారులకు అనుకూలంగా మార్చేందుకు, రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. స్కైవాక్‌లు పాదచారులకు రోడ్లు దాటడమే కాకుండా ప్రయాణికులకు ఇబ్బంది లేని రైడ్‌ను అందిస్తాయి. ఇలాంటి మరిన్ని కార్యక్రమాలతో, హైదరాబాద్ భారతదేశంలో అత్యంత పాదచారులకు అనుకూలమైన నగరాల్లో ఒకటిగా మారనుంది.

Next Story