హైదరాబాద్ : మైలార్‌దేవ్‌పల్లి రోడ్డు వద్ద ఆదివారం మధ్యాహ్నం ట్రక్కు ఢీకొనడంతో కారు సహా మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. లారీ చాంద్రాయణగుట్ట నుంచి కాటేదాన్ వైపు వెళ్తుండగా డ్రైవర్.. పాదచారులను ఢీకొట్టకుండా తప్పించుకునే ప్రయత్నంలో డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కనే ఉన్న గోడను ఢీకొట్టి వ్యాపార సముదాయంలోకి దూసుకెళ్లనిచ్చాడు. వ్యాపార సముదాయం గోడ కూలి వాహనాల పై పడింది. ఈ ఘటనలో కారు సహా మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. మూడు వాహనాలు రోడ్డు పక్కనే నిలిచి ఉండడంతో లోపల ఎవరూ లేరు.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. లారీ అధుపు తప్పి వస్తుండటంతో జనం భయంతో పరుగులు తీశారు. ట్రాఫిక్ పోలీసులు, మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రద్దీగా ఉండే రహదారిపై ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. పోలీసులు పెద్ద క్రేన్ల సహాయంతో ధ్వంసమైన వాహనాలను తొలగించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పెద్ద క్రేన్ సాయంతో లారీని బయటకు తీశామని పోలీసులు తెలిపారు. మితిమీరిన వేగం నిర్లక్ష్యంగా లారీ నడపడంతోనే ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు.