'అఖండ'పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ప్రశంసలు.. ఎందుకంటే

Hyderabad traffic police praise ‘Akhanda’.బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన చిత్రం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Jan 2022 3:45 PM IST
అఖండపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ప్రశంసలు.. ఎందుకంటే

బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన చిత్రం 'అఖండ‌'. థియేట‌ర్ల‌లోనే కాకుండా ఓటీటీలోనూ ఈ చిత్రం దుమ్మురేపుతోంది. రికార్డులు కొల్ల‌గొడుతున్న అఖండ చిత్రంపై హైద‌రాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు చేసిన ట్వీట్ వైర‌ల్‌గా మారింది. రోడ్డు భద్రతను ప్రోత్సహించినందుకు హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనుతో పాటు మూవీ టీమ్‌కు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సోష‌ల్ మీడియా వేదిక‌గా ధ‌న్య‌వాదాలు చెప్పారు.

ఈ చిత్రంలో ఓ సీన్‌లో హీరో బాలయ్య, హీరోయిన్‌ ప్రగ్యా జైశ్వాల్‌ ఇద్దరూ కారులో వెలుతుంటారు. ఓ ట్ర‌క్ అడ్డురావ‌డంతో బాల‌య్య స‌డెన్ బ్రేక్ వేస్తాడు. ప్ర‌గ్యా త‌ల డాష్ బోర్డుకు గుద్దుకోబోతుండ‌గా.. బాల‌య్య త‌న చేతిని అడ్డుపెడ‌తాడు. అనంత‌రం సీటు బెల్ట్ పెట్టుకోండి.. జీవితం చాలా విలువైనది అంటూ బాల‌య్య చెబుతాడు. కాగా..ఆ సీన్‌ను హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు ట్యాగ్‌ చేస్తూ ట్వీట్ చేశారు. ఈ ఫోటోలో బాలయ్య, ప్రగ్యా జైశ్వాల్ ఇద్దరూ సీట్‌ బెల్టు పెట్టుకుని ఉంటారు. 'కారు సీట్ బెల్ట్ ధరించి ఎంత దూరమైనా, ఎవరి కారు అయినా సరే ఎల్లప్పుడూ సీట్ బెల్ట్ ధరించండి' అంటూ ట్వీట్ చేశారు. ఇలాగే ప్రజలందరూ సీట్‌ బెల్టు పెట్టాకోవాలని సూచనలు చేశారు.


Next Story