ఫుట్‌పాత్‌ ఆక్రమణ.. హైదరాబాద్‌లో నాలుగు ఫర్నిచర్ షాపులపై క్రిమినల్ కేసు

Hyderabad traffic police book 4 furniture shops in Lakdikapul. హైదరాబాద్: లక్డీకాపూల్‌లోని రోడ్డు, ఫుట్‌పాత్‌ను ఆక్రమించుకున్న నాలుగు ఫర్నీచర్ షాపుల యజమానులపై

By అంజి  Published on  22 Sep 2022 11:04 AM GMT
ఫుట్‌పాత్‌ ఆక్రమణ.. హైదరాబాద్‌లో నాలుగు ఫర్నిచర్ షాపులపై క్రిమినల్ కేసు

హైదరాబాద్: లక్డీకాపూల్‌లోని రోడ్డు, ఫుట్‌పాత్‌ను ఆక్రమించుకున్న నాలుగు ఫర్నీచర్ షాపుల యజమానులపై సైఫాబాద్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. సబ్‌ఇన్‌స్పెక్టర్‌ సైఫాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు మేరకు నాలుగు ఫర్నీచర్‌ దుకాణాలపై ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ) సెక్షన్‌ 341 కింద కేసు నమోదు చేశారు.

మెహదీ ఫంక్షన్ హాల్ పక్కనే ఉన్న రాయల్ ఫర్నీచర్ షాప్, ఎలిగెంట్ కేన్ ఫర్నీచర్ షాప్, AVM వెంచర్ ఆఫీస్ పక్కనే ఉన్న రాయల్ ఫర్నిచర్ షాప్, కేన్ ఇంటీరియర్ షాప్ బుక్ చేయబడిన నాలుగు షాపుల్లో ఉన్నాయి. అయోధ్య జంక్షన్ నుండి నిరంకారి జంక్షన్ వరకు ఉన్న రోడ్డు, ఫుట్‌పాత్‌ను ఆక్రమించుకుని కుర్చీలు, బల్లలు, ఇతర వస్తువులను ప్రధాన రహదారి, ఫుట్‌పాత్‌పై పెడుతున్నారు. దీని ద్వారా ప్రధాన రహదారిపై నడిచే పాదచారులకు ఇది అసౌకర్యంగా ఉందని, ఇది ప్రమాదకరంగా ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు.

నాలుగు ఫర్నీచర్ దుకాణాలు తమ సరుకులను లోడ్ చేయడానికి, అన్‌లోడ్ చేయడానికి తమ వాహనాలను రోడ్డుపై పార్క్ చేస్తున్నాయని సైఫాబాద్ పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌, పాదచారులకు అంతరాయం ఏర్పడుతోంది.

''ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ 'వాహనాల అబ్స్ట్రక్టివ్ పార్కింగ్'పై ఎక్కువ దృష్టి పెడుతోంది. మేము వాణిజ్య సంస్థలు (బిల్డింగ్ యజమానులు, దుకాణ యజమానులు ఇద్దరూ) నిబంధనలు ఉల్లంఘిస్తే కేసు నమోదు చేస్తాము. ప్రస్తుతం నగరంలో అలాంటి సంస్థలు (ఆక్రమణలు) వేల సంఖ్యలో ఉన్నాయి కాబట్టి, మేము దశల వారీగా ముందుకు సాగుతున్నాం'' అని హైదరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) ఏవీ రంగనాథ్ తెలిపారు.

దాదాపు అన్ని ఫుట్‌పాత్‌లు ఆక్రమణలకు గురయ్యాయని, వాణిజ్య సంస్థలు పార్కింగ్ స్థలాలు లేకుండా ఉన్నాయని అన్నారు. పార్కింగ్‌ స్థలాలు లేని వాణిజ్య సంస్థలు ట్రాఫిక్‌ ఇబ్బందులను సృష్టిస్తున్నాయన్నారు. "మొదట వారికి నోటీసు ఇవ్వబడుతుంది. ఆ తరువాత u/s 341 IPC, 290 IPC ప్రకారం క్రిమినల్ చర్యలు ప్రారంభించబడతాయి" అని ఆయన వివరించారు.

ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ముఖ్యమైన ప్రధాన రహదారులపై తొలుత దృష్టి సారిస్తామని రంగనాథ్ తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా నడుపుతూ తీవ్ర ట్రాఫిక్‌ రద్దీని సృష్టిస్తున్న సంస్థలను మూసివేయాలని జీహెచ్‌ఎంసీని కూడా కోరతామని తెలిపారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వివిధ ఉల్లంఘనలకు సంబంధించి ఇప్పటికే జరిమానాలను పెంచారని తెలిపారు. ట్రాఫిక్ అక్రమాలకు అలవాటు పడిన వారు, సకాలంలో జరిమానాలు చెల్లించని వారు తదుపరి ట్రాఫిక్ ఉల్లంఘనల్లో పెరిగిన జరిమానాలు చెల్లించాల్సి ఉంటుందని, దీనివల్ల దీర్ఘకాలంలో మంచి ట్రాఫిక్ క్రమశిక్షణ వస్తుందని చెప్పారు.

Next Story