Hyderabad: కుత్బుల్లాపూర్‌లో ట్రాఫిక్ మళ్లింపు.. నేటి నుంచి నెల రోజుల పాటు

జీడిమెట్ల ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కుతుబుల్లాపూర్‌ ర్కిల్-25లోని కుతుబుల్లాపూర్ వార్డు నంబర్ 131లోని చింతల్‌

By అంజి  Published on  28 April 2023 9:01 AM IST
Qutubullapur, Hyderabad,Traffic diversions, GHMC,  Jeedimetla

Hyderabad: కుత్బుల్లాపూర్‌లో ట్రాఫిక్ మళ్లింపు.. నేటి నుంచి నెల రోజుల పాటు

హైదరాబాద్‌: జీడిమెట్ల ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కుతుబుల్లాపూర్‌ ర్కిల్-25లోని కుతుబుల్లాపూర్ వార్డు నంబర్ 131లోని చింతల్‌ మార్కెట్‌ వద్ద ట్విన్‌సెల్ బాక్స్ కల్వర్టు నిర్మాణం కోసం రోజూ 12 గంటలపాటు ట్రాఫిక్‌ మళ్లిస్తున్నట్లు సైబరాబాద్‌ పోలీసులు తెలిపారు. శుక్రవారం ప్రారంభమైన మళ్లింపు మే 28 వరకు 30 రోజుల పాటు ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది.

చింతల్ మెయిన్ రోడ్డు నుంచి పద్మానగర్ రింగ్ రోడ్డు వైపు వెళ్లే వాహనాలను వాణినగర్, కుత్బుల్లాపూర్ గ్రామం మీదుగా ఎల్లమ్మ ఆలయం వద్ద మళ్లిస్తారు. పద్మానగర్ రింగ్ రోడ్డు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పాండు విగ్రహం, చింతల్ మెయిన్ రోడ్డు మీదుగా మాణిక్యనగర్ కమాన్ వద్ద మళ్లిస్తారు.

పద్మానగర్ రింగ్ రోడ్డు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను చికెన్ మార్కెట్ వద్ద అంబేద్కర్‌నగర్ రోడ్డు, అంబేద్కర్ విగ్రహం, రాంరెడ్డినగర్-రెయిన్‌బో హైస్కూల్ మీదుగా ఐడీపీఎల్ ప్రధాన రహదారిపైకి మళ్లిస్తారు. పనులు త్వరగా పూర్తి చేయడానికి ప్రజలు సహకరించాలని వర్క్ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ, ట్రాఫిక్ పోలీసులు అభ్యర్థించారు.

Next Story