ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ నగరంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే ప్రమాదం ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. శనివారం లోక్‌సభలో ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వం హైదరాబాద్‌ను తన గుప్పిట్లోకి తీసుకునేందుకు కేంద్రపాలిత ప్రాంతంగా మార్చుతుందని అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం భవిష్యత్‌లో ఇదే నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందని.. చెన్నై, బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్, లక్నో నగరాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చే ప్రమాదం ఉందని ఆరోపించారు. ఇదే బీజేపీ మార్క్ పాలన అని, కశ్మీర్ విభజనే దీనికి ఉదాహరణ అని అన్నారు. బీజేపీకి మద్దతిచ్చే పార్టీలు భవిష్యత్ పరిణామాలకు సిద్ధంగా ఉండాలని ఒవైసీ హెచ్చరించారు.
హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయొచ్చంటూ అసద్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి. జమ్మూ కశ్మీర్ విభజన చట్టంపై చరిగిన చర్చలో భాగంగా అసదుద్దీన్ ఈ కామెంట్స్ చేశారు. హైదరాబాద్‌తో పాటు చెన్నై, బెంగుళూరు, ముంబై, అహ్మదాబాద్, లక్నోలను బీజేపీ ప్రభుత్వం కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చాలని చూస్తోందన్నారు. ఇందుకు కశ్మీర్ విభజనే పెద్ద ఉదాహరణగా చూపారు. ఇప్పడు ప్రభుత్వానికి మద్దతిచ్చే పార్టీలు భవిష్యత్ పరిణామాలకు రెడీగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పుడు చప్పట్లు కొట్టే పార్టీలు అప్పుడు గొడవలు చేయడం ఖాయమన్నారు.