హైదరాబాద్‌లో సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్.. పక్కనే ఫుడ్‌ కోర్టులు కూడా..!

Hyderabad to get solar-roof cycle track. హైదరాబాద్‌కు మరో ట్రెండ్‌ సెట్టర్‌ రానుంది. త్వరలోనే సోలార్‌ రూఫ్‌ సైకిల్‌ ట్రాక్‌లు ఏర్పాటు కానున్నాయి.

By అంజి  Published on  11 Aug 2022 9:01 AM GMT
హైదరాబాద్‌లో సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్.. పక్కనే ఫుడ్‌ కోర్టులు కూడా..!

హైదరాబాద్‌కు మరో ట్రెండ్‌ సెట్టర్‌ రానుంది. త్వరలోనే సోలార్‌ రూఫ్‌ సైకిల్‌ ట్రాక్‌లు ఏర్పాటు కానున్నాయి. సోలార్‌ ప్యానెళ్ల నీడలో ఎంచక్కా సైకిల్‌ తొక్కొచ్చు. దీంతో సైకిల్‌ తొక్కే వారికి ఎండ నుంచి, వర్షం నుంచి రక్షణ లభించడంతో పాటు.. సోలార్ ప్యానెళ్ల నుంచి కరెంట్‌ ఉత్పత్తి అవుతుంది. పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా.. 21 కిలోమీటర్ల పొడవున ఔటర్‌ రింగ్‌ రోడ్డు, సర్వీస్‌ రోడ్డు మధ్య ఈ సోలార్‌ రూఫ్‌ సైకిల్‌ ట్రాక్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ 21 కిలోమీటర్ల సోలార్‌ సైక్లింగ్‌ ట్రాక్‌ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే కోకాపేటలో నిర్మాణం జరుగుతోంది.

"ట్రాక్‌ను పైలట్ ప్రాతిపదికన అభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన తర్వాత.. మొత్తం 21-కిమీల విస్తీర్ణంలో ఇదే నమూనాను అవలంబిస్తాము" అని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారి ఒకరు తెలిపారు. ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డు వెంబడి సైకిల్‌ ట్రాక్‌ నిర్మాణం, సోలార్‌ ప్యానెల్‌ ఏర్పాటు తదితర పనులకు ఇటీవల టెండర్లు పిలిచారు. నార్సింగి నుంచి కొల్లూరు వరకు 13 కిలోమీటర్లు, నానక్రామ్‌గూడ నుంచి తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీ (టీఎస్‌పీఏ) వరకు 8 కిలోమీటర్ల మేర ఈ ట్రాక్‌ సాగనుంది.

నగరంలో ప్రస్తుతం ఉన్న సైకిల్ ట్రాక్‌లు, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో నిర్మాణంలో ఉన్న సైకిల్ ట్రాక్‌లు మాదిరిగా కాకుండా.. ఎండ, వర్షం, ఇతర కఠినమైన వాతావరణ పరిస్థితుల నుండి రక్షణ ఇస్తుంది సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్. అలాగే ట్రాఫిక్ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సైక్లిస్టులకు భద్రత ఫీల్ ఉంటుంది. ట్రాక్ కోసం ఫుడ్ కోర్టులు, నిఘా కెమెరాలు, తాగునీరు, సైకిల్ మరమ్మతు దుకాణాలు కూడా వస్తాయి. లైటింగ్ కోసం సోలార్-ప్యానెల్ పైకప్పు నుండి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.

నగరంలో ప్రస్తుతం ఉన్న సైకిల్ ట్రాక్‌లు, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్మాణంలో ఉన్న సైకిల్ ట్రాక్‌లు కాకుండా, ఈ సైకిల్ ట్రాక్ సైక్లిస్టులకు ఎండ, వర్షం, ఇతర కఠినమైన వాతావరణ పరిస్థితుల నుండి రక్షణను అందిస్తుంది. అలాగే ట్రాఫిక్ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ట్రాక్ ఏర్పాటైన తర్వాత పక్కనే ఫుడ్ కోర్టులు, నిఘా కెమెరాలు, తాగునీరు,సైకిల్ మరమ్మతు దుకాణాలు కూడా వస్తాయి. ''సైకిల్ ట్రాక్ సోలార్ రూఫింగ్ ద్వారా దాదాపు 9మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు. ఈ విద్యుత్‌ను ఓఆర్‌ఆర్‌ వెంట డ్రిప్ ఇరిగేషన్, వీధిలైట్ల కోసం వినియోగిస్తారు.'' అని హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ కోసం రెన్యూవబుల్ ఎనర్జీ సర్వీస్ కంపెనీ నమూనాను తీసుకున్నారు.

Next Story
Share it