అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. హైదరాబాద్‌కు తొలి మహిళా ఎస్‌హెచ్‌ఓ

Hyderabad to get its first female SHO on International Women's Day. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మంగళవారం) సందర్భంగా లా అండ్ ఆర్డర్ పోలీస్

By అంజి  Published on  8 March 2022 5:31 AM GMT
అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. హైదరాబాద్‌కు తొలి మహిళా ఎస్‌హెచ్‌ఓ

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మంగళవారం) సందర్భంగా లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్‌లో స్టేషన్-హౌస్-ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ)గా మహిళా ఇన్‌స్పెక్టర్‌ను నియమించేందుకు పోలీస్‌ శాఖ సిద్ధమైంది. హైదరాబాద్ నగరంలో తొలిసారిగా ఎస్‌హెచ్‌ఓగా మహిళను నియమిస్తున్నట్లు కమిషనర్ ఆఫ్ పోలీస్ సీవీ ఆనంద్ ప్రకటించారు. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ పోలీసులు ఎస్‌హెచ్‌ఓగా మహిళను నియమిస్తారని, రానున్న రోజుల్లో కీలక స్థానాల్లో మరింత మంది మహిళలను నియమించనున్నారు. హైదరాబాద్ సిటీ పోలీసుల షీ టీమ్స్ ఆదివారం నిర్వహించిన 'లింగ సమానత్వ పరుగు'లో కమిషనర్ మాట్లాడారు.

2కే, 5కే రన్‌లను హోం మంత్రి మహమూద్ అలీ, విద్యా మంత్రి పి. సబితా ఇంద్రా రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో వేలాది మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్, గృహిణులు, విద్యార్థులు పాల్గొన్నారు. 'లింగ సమానత్వ పరుగు'లో పెద్ద ప్రకటన చేస్తూ, కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూనే అన్ని ప్రధాన రంగాలకు గొప్పగా సహకరిస్తున్న మహిళల ప్రాముఖ్యతను గుర్తించే రోజు మహిళా దినోత్సవమని కమిషనర్ అన్నారు. ఇటీవల హైదరాబాద్ నగరంలో ఎనిమిది మంది మహిళా ఎస్‌ఐలు రిపోర్టు చేశారని, వారికి శిక్షణ ఇచ్చి కీలక స్థానాల్లో నియమించేందుకు ఎదురుచూస్తున్నామని టీఎన్‌ఐఈ పేర్కొంది. మొత్తం పోలీసు బలగాలలో కనీసం 20 నుంచి 30 శాతం మహిళా కానిస్టేబుళ్లు, ఎస్‌ఐలు ఉంటారని తాము భావిస్తున్నామని ఆయన అన్నారు.

Next Story