Hyderabad: డీసీఎంను ఢీకొట్టిన కారు.. ముగ్గురు విద్యార్థులు స్పాట్‌ డెడ్‌

హైదరాబాద్‌ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం కారు డీసీఎం వాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు.

By అంజి
Published on : 21 May 2025 10:49 AM IST

Hyderabad: డీసీఎంను ఢీకొట్టిన కారు.. ముగ్గురు విద్యార్థులు స్పాట్‌ డెడ్‌

Hyderabad: డీసీఎంను ఢీకొట్టిన కారు.. ముగ్గురు విద్యార్థులు స్పాట్‌ డెడ్‌ 

హైదరాబాద్‌ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం కారు డీసీఎం వాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూరు గ్రామంలోని నారాయణ కళాశాల సమీపంలో ఈ సంఘటన జరిగింది. పసుమాముల గ్రామం నుండి కుంట్లూరుకు స్కోడా కారు (రిజిస్ట్రేషన్ నంబర్ MH-02-DG-0771) వెళుతుండగా, ఒక డీసీఎం వాహనం (TS-07-UK-2664) వ్యతిరేక దిశలో వెళ్తూ ఢీకొట్టుకున్నాయని నివేదికలు తెలిపాయి.

నారాయణ కళాశాల (బాసర క్యాంపస్) సమీపంలోని AEGIS LPG బంక్ సమీపంలోని వంపు వద్ద రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. సప్రమాదం ప్రభావం చాలా తీవ్రంగా ఉండటంతో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు. మృతులను పిన్నింటి చంద్రసేన రెడ్డి (24), చుంచు త్రినాధ్ రెడ్డి (24), చుంచు వర్షిత్ రెడ్డి (23) గా గుర్తించారు, వీరందరూ కుంట్లూరు నివాసితులు. వారి మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

కుంట్లూరుకు చెందిన అలిమేటి పవన్ కళ్యాణ్ రెడ్డి (24) గాయపడి హయత్‌నగర్‌లోని సన్‌రైజ్ ఆసుపత్రిలో చేరాడు. హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఢీకొనడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. అధిక వేగం, ప్రమాదాకరమైన మలుపు ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమిక పరిశోధనలు సూచిస్తున్నాయి.

Next Story