హైదరాబాద్: అశోక్‌నగర్‌లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రూప్-1 మెయిన్స్ వాయిదా వేయాలని, జీవో 29ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు రోడ్డెక్కారు. వారికి మద్ధతుగా ప్రతిపక్ష నేతలు కూడా అక్కడికి చేరుకున్నారు. వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా రేపటి నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు యథావిథిగా జరుగుతాయని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.
నిరుద్యోగుల నిరసనలు, అరెస్టులతో అశోక్‌నగర్ అట్టుడుకుతోంది. నిన్న జరిగిన నిరసనల హోరులో ఆందోళనకారులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. తమ ఓట్లతో గెలిచిన రేవంత్ ఎక్కడ దాక్కున్నారు, ఎందుకు మాట్లాడటం లేదు? అంటూ నిరుద్యోగులు ప్రశ్నించారు. అశోక్‌నగర్‌లో గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనలు కనిపిస్తలేవా? ఓట్లు వేస్తే గెలిచిన తమపై ఎందుకింత కర్కశంగా ప్రవర్తిస్తున్నారంటూ ప్రశ్నించారు.