అలర్ట్.. హైదరాబాద్‌లో భారీ వర్షం
హైదరాబాద్ నగరంలో రెండ్రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 24 Sept 2024 5:03 PM ISTహైదరాబాద్ నగరంలో రెండ్రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. చాలా చోట్ల వర్షాలు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు పడబోతున్నాయని అన్నారు.. సుచిత్ర, గుండ్లపోచంపల్లి, బహదూర్‌పల్లి, సూరారం, కొంపల్లి, చింతల్, కండ్లకోయ, కృష్ణాపూర్, దుండిగల్, డబిల్‌పూర్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం కురుస్తోంది. కరీంనగర్, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి జిల్లాల్లో పడుతాయని చెప్పారు.
ఇక తెలంగాణ వ్యాప్తంగా నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. మెరుపులు, ఉరుములతో వర్షాలు కురుస్తాయనీ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. బుధవారం గంటకు 40 నుంచి 50 కి.మీ, గురువారం 30 నుంచి 40 కి.మీ వేగంతో అక్కడక్కడ గాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించింది. ఇక లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలో సహాయక సిబ్బంది సిద్ధం అయ్యారు. ఎక్కడ ఎలాంటి అవసరం ఉన్నా.. వెంటనే రంగంలోకి దిగనున్నారు. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశా తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని పరిసర వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ పేర్కొంది.దీని ప్రభావంగానే తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి.