హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్‌లో ఎంతో పేరుగాంచిన ప్రముఖ తాజ్ బంజారా హోటల్‌ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీజ్ చేశారు. ఆస్తి పన్నులు చెల్లించడంలో విఫలమైనందుకు అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. తెలిసిన వివరాల ప్రకారం.. గత రెండు సంవత్సరాలుగా పన్ను చెల్లించకపోవడం, చెల్లించాలని జారీ చేసిన నోటీసులపై కూడా స్పందించలేదు. దీంతో అధికారులు హోటల్‌ను సీజ్ చేశారు.
రూ.1 కోటి 40 లక్షల పన్ను బకాయిలపై గడువు ఇచ్చినా యాజమాన్యం పట్టించుకోకపోవడంతో అధికారులు చర్యలు చేపట్టారు. కాగా నగరంలో నిత్యం బిజీగా ఉండే హోటళ్లలో తాజ్ బంజారా ఒకటి. ఈ హోటల్‌కు ఎక్కువగా సెలబ్రెటీలు వస్తుంటారు. టీమ్ ఇండియా క్రికెటర్లు ఎప్పుడు వచ్చినా ఈ హోటల్‌లో స్టే చేస్తుంటారు. అలాగే దేశంలోని కీలక రాజకీయ నేతలు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడే స్టే చేస్తారు.