హైదరాబాద్: టోలిచౌకి పారామౌంట్ కాలనీలో ఆదివారం రాత్రి కొంతమంది వ్యక్తులు ఒక ఎంబీఏ విద్యార్థిని దారుణంగా హత్య చేశారు. టోలిచౌకి నివాసి అయిన 21 ఏళ్ల మొహమ్మద్ ఇర్ఫాన్ ఉదయం పూట కాలేజీకి వెళ్తూ.. మధ్యాహ్నం తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆటో రిక్షా నడుపుతున్నాడు. ఇర్ఫాన్ ఆరు నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. శనివారం రాత్రి.. 5 నుండి 6 మంది వ్యక్తులు ఇర్ఫాన్ ఇంటికి వచ్చి అతన్ని పారామౌంట్ కాలనీ గేట్ నంబర్ 1 వద్దకు తీసుకెళ్లారు.
ఆ తర్వాత ఆ వ్యక్తులు ఇర్ఫాన్‌పై కత్తులతో దారుణంగా దాడి చేసి, హత్యకు పాల్పడ్డారని టోలిచౌకి పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఇర్ఫాన్ తమ్ముడు అద్నాన్ తన వాహనాన్ని రోడ్డుపై పార్క్ చేశాడని, కొంతమందితో వాగ్వాదం జరిగిందని ఇర్ఫాన్ తల్లి మీడియాకు తెలిపింది. ఆ తర్వాత ఆ వ్యక్తి తన స్నేహితులకు ఈ విషయం చెప్పాడు. వారు ఇర్ఫాన్ ఇంటికి వచ్చి, అతనితో జరిగిన వాగ్వాదాల తర్వాత ఇర్ఫాన్ ను హత్య చేశారు.