Hyderabad: ఎస్కలేటర్‌ ముందు నిలిచిన డ్రైనేజీ నీరు.. పాదచారులకు తీవ్ర ఇబ్బంది

హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక వైద్యశాల, ఈఎస్‌ఐ ఆస్పత్రి మధ్య పాదచారుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఎస్కలేటర్‌ను ఉపయోగించాలనుకునే ప్రజలు ఊహించని సవాలును ఎదుర్కొంటున్నారు.

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 30 March 2024 9:11 AM IST

Hyderabad, drainage water, escalator , Erragadda Hospital

Hyderabad: ఎస్కలేటర్‌ ముందు నిలిచిన డ్రైనేజీ నీరు.. పాదచారులకు తీవ్ర ఇబ్బంది

హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక వైద్యశాల, ఈఎస్‌ఐ ఆస్పత్రి మధ్య పాదచారుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఎస్కలేటర్‌ను ఉపయోగించాలనుకునే ప్రజలు ఊహించని సవాలును ఎదుర్కొంటున్నారు. నిలిచిపోయిన డ్రైనేజీ నీటిలో అడుగు పెట్టడం ఇబ్బందికరంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) చేత నిర్మించబడిన ఈ ఫుట్ ఓవర్‌బ్రిడ్జి రద్దీగా ఉండే రహదారిని దాటే పాదచారులకు సురక్షితమైన మార్గం కోసం ఉద్దేశించబడింది. అయితే ఎస్కలేటర్ చుట్టూ డ్రెయినేజీ నీరు ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

ప్రతిరోజూ అనేక మంది వ్యక్తులు, పాఠశాల పిల్లలు, రోగులు, వారి పరిచారకులు, సెంట్రల్ యునాని ఆసుపత్రి, ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి, మానసిక ఆసుపత్రి, ఈఎస్‌ఐ ఆసుపత్రి వంటి వాటి మధ్య ప్రయాణించడానికి ఈ ఫుట్ ఓవర్‌బ్రిడ్జిపైనే ఆధారపడతారు. ఎస్కలేటర్ రోడ్డు మీదుగా వారి ప్రయాణాన్ని సులభతరం చేయడానికి రూపొందించబడింది. ప్రత్యేకించి పాదాచారుల కోసం ఇది ఉద్దేశించబడింది.

దురదృష్టవశాత్తూ.. ఎస్కలేటర్ చుట్టూ స్థిరంగా ఉన్న డ్రైనేజీ నీరు వినియోగదారులకు అడ్డంకిని సృష్టించింది. రోగులు, వారి పరిచారకులు, వృద్ధులు, ఇతరులతో పాటు ఎస్కలేటర్‌ను ఉపయోగించడం కోసం తప్పనిసరి పరిస్థితిలో నీటిలోకి అడుగు పెట్టవలసి వస్తుంది. ఆరోగ్యం, భద్రతా ప్రమాదాల ఆందోళనలను లేవనెత్తుతోంది. జీహెచ్‌ఎంసి అధికారులు స్పందించి ఎక్కడికక్కడ నిలిచిపోయిన నీటిని ఒడిసిపట్టి సమస్యను పరిష్కరించాలని, ఇది పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు.

Next Story