హైదరాబాద్: మీర్‌పేట్‌లోని హస్తినాపురంలో దావత్ బిర్యానీ హోటల్ నిర్వహకులు వీరంగం సృష్టించారు. హోటల్‌లో కస్టమర్ ఆర్డర్‌పై వివాదం హింసాత్మకంగా మారింది. హోటల్‌కు వచ్చిన కస్టమర్‌పై సిబ్బంది దాడి చేశారు. హోటల్ మేనేజర్ దగ్గరుండి దాడి చేయించారని సమాచారం. వినియోగదారుడి నిర్వాహకుల మధ్య వాగ్వాదం జరగడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన మీర్‌పేట్ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. హోటల్ లో జరిగిన దాడి ఘటన సీసీటీవీ లో రికార్డ్ అయ్యింది. హోటల్ సిబ్బందిని కఠినంగా శిక్షించాలని బాధితుడు డిమాండ్ చేశాడు.