Hyderabad: హబ్సిగూడలో డీసీఎం వ్యాన్‌ బీభత్సం.. వీడియో

హైదరాబాద్‌ నగరంలో డీసీఎం వ్యాన్‌ బీభత్సం సృష్టించింది.

By అంజి
Published on : 24 March 2025 12:18 PM IST

Hyderabad, Speeding, DCM crash, two-wheelers, Habsiguda

Hyderabad: హబ్సిగూడలో డీసీఎం వ్యాన్‌ బీభత్సం.. వీడియో

హైదరాబాద్‌ నగరంలో డీసీఎం వ్యాన్‌ బీభత్సం సృష్టించింది. ఇవాళ ఉదయం సమయంలో హబ్సిగూడ ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద అతి వేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్‌.. ఆగి ఉన్న ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. దీంతో బైక్‌లు ధ్వంసమయ్యాయి. బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో డీసీఎం డ్రైవర్, ద్విచక్ర వాహనాలపై ఉన్న నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

వారిలో ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వ్యాన్‌ బీభత్స ఘటనతో హబ్సిగూడ సిగ్నల్‌ వద్ద భారీగా ట్రాఫిక్‌ అయ్యింది. వెంటనే డీసీఎంను అక్కడి నుంచి తొలగించిన ట్రాఫిక్‌ పోలీసులు.. వెంటనే చర్యలు తీసుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story