హైదరాబాద్‌ను వణికిస్తున్న చలి.. ఎల్లో అలర్ట్ జారీ
Hyderabad shivers as winter chill continues.. Yellow alert issued. హైదరాబాద్ వాసులు ఇప్పటికీ శీతాకాలపు చలిని చూస్తున్నారు. ముఖ్యంగా
By అంజి
హైదరాబాద్ వాసులు ఇప్పటికీ శీతాకాలపు చలిని చూస్తున్నారు. ముఖ్యంగా రాత్రి, తెల్లవారుజామున నగరంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదు అవుతున్నాయి. సోమవారం ఉదయం హైదరాబాద్ విమానాశ్రయంలో కనిష్ట ఉష్ణోగ్రత 6.5 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. నగరంలో ఈ సీజన్‌లో ఇదే అత్యల్ప ఉష్ణోగ్రత. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) ప్రకారం.. జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉండనున్నాయి. జనవరి 15 వరకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది.
ఇతర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు
శీతాకాలపు చలి హైదరాబాద్‌కే పరిమితం కాలేదు. తెలంగాణ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు ముఖ్యంగా ఉత్తరాది జిల్లాలు కూడా చలిగాలులు వీస్తున్నాయి. ఆదిలాబాద్, కొమరం భీమ్, నిర్మల్, మంచిర్యాల తదితర ఉత్తరాది జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ఈ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుత చలికాలంలో హైదరాబాద్ వాసులు రోజులో రెండు సీజన్లు చూస్తున్నారు. వారు చల్లని రాత్రులు, వెచ్చని రోజులను చూస్తున్నారు.
రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతుండగా, పగటిపూట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్‌కు పైగా పెరుగుతోంది. మరో మూడు రోజుల్లో కూడా నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 30-32 డిగ్రీల సెల్సియస్‌లో నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా 30-33 డిగ్రీల సెల్సియస్‌లో ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. 2015 తర్వాత, 2022 డిసెంబర్‌లో హైదరాబాద్ అత్యంత వేడిగా ఉంది. నెలలో ఉష్ణోగ్రత 31 డిగ్రీల కంటే తగ్గలేదు. IMD హైదరాబాద్ ప్రకారం, డిసెంబర్‌లో నగరంలో సాధారణ గరిష్ట ఉష్ణోగ్రత 28.4 డిగ్రీల సెల్సియస్. గత ఏడాది డిసెంబర్‌లో హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా చలికాలం చలిగాలులు వీచాయి.