Hyderabad: హోటల్ రూమ్‌లో సీక్రెట్ కెమెరా.. జంటలను బెదిరించి డబ్బులు వసూలు
హోటల్ నిర్వాహకులు కొందరు రహస్యంగా కెమెరాలను ఏర్పాటు చేసి.. కెమెరాలో బందీ అయిన దృశ్యాలను చూపించి యువతీ యువకులను బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు.
By అంజి Published on 28 Aug 2024 1:45 PM ISTHyderabad: హోటల్ రూమ్‌లో సీక్రెట్ కెమెరా.. జంటలను బెదిరించి డబ్బులు వసూలు
హైదరాబాద్: సాధారణంగా కొత్తగా పెళ్లైన వాళ్ళు.. ప్రేమ జంటలు హోటల్స్‌కి వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా ఎంజాయ్ చేసే యువతీ, యువకులు తస్మాత్ జాగ్రత్త.. ఎందుకంటే హోటల్ నిర్వాహకులు కొందరు రహస్యంగా కెమెరాలను ఏర్పాటు చేసి.. కెమెరాలో బందీ అయిన దృశ్యాలను చూపించి యువతీ యువకులను బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. నగరంలో ఓయో పార్ట్‌నర్‌షిప్ కలిగి ఉన్న హోటల్స్ ఎన్నో ఉన్నాయి. ఈ ఓయో హోటల్స్ ఎన్నోసార్లు వివాదంలో చిక్కుకున్నాయి.. అయినా కూడా హోటల్ నిర్వాహకులు వారు తీరును మాత్రం మార్చుకోవడం లేదు.
ఇప్పుడు తాజాగా సీత గ్రాండ్ ఓయో హోటల్ నిర్వాహకుడి నిర్వాకం కాస్త ఓ యువతీ, యువకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెలుగు చూసింది. ఓ జంట శంషాబాద్ నగర శివారు ప్రాంతంలో ఉన్న సీతా గ్రాండ్ హోటల్ కి వెళ్లారు. అయితే శంషాబాద్ మున్సి పాలిటీ పరిధిలోని సీత గ్రాండ్ హోటల్ యజమాని గణేష్.. హోటల్ రూమ్‌లో రహస్యంగా కెమెరాలు అమర్చాడు. హోటల్‌లో దిగిన కస్టమర్ల అశ్లీల వీడియోలు చిత్రీకరించి వాటిని సెల్‌ఫోన్‌లో వేసుకొని ఆ జంటలకు వాటిని చూపించి.. వారిని బ్లాక్‌మెయిల్ చేస్తూ, వారి వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తు న్నాడు. ఈ విషయం తెలియక ఆ హోటల్ కు వచ్చిన ఒక జంట రూమ్ తీసుకొని గదిలోకి వెళ్ళి ఎంజాయ్ చేసింది.
ఆ తర్వాత ఆ జంటకు సీక్రెట్ సీసీ కెమెరా కంట పడింది. ఆ జంట ఆగ్రహంతో ఊగి పోతూ హోటల్ యజమాని గణేష్ వద్దకు వెళ్లి నిలదీసి అడిగారు. తనకేమి తెలియదంటూ హోటల్ యజమాని గణేష్ బకాయించడానికి ప్రయత్నించాడు. అంతేకా కుండా హోటల్ యజమాని గణేష్ ఆ జంటను నోటికి వచ్చినట్లుగా తిట్టాడు. చేసేదేమీ లేక ఆ జంట పోలీసులను ఆశ్రయిం చారు. రంగంలోకి దిగిన శంషాబాద్ పోలీసులు హోటల్ ను తనిఖీ చేసి రహస్య సిసి కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆర్ జి ఐ ఎయిర్పోర్ట్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.